Sep 25 2021 @ 08:05AM

ఆమిర్ ఖాన్‌తో డిన్నర్.. ఎమోషనల్ అయిన నాగార్జున

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఇటీవల హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున తనయుడు నాగ చైతన్య నటించిన తాజా చిత్రం 'లవ్ స్టోరీ'ని ప్రమోట్ చేయడానికి ఆయన హైదరాలోనే ఉన్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. నారాయణ్ దాస్ కె. నారంగ్, పి రామ్మోహన్‌ రావు నిర్మించారు. కోవిడ్ -19 సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

ప్రచార కార్యక్రమం తర్వాత, నాగార్జున మరియు అతని కుటుంబం ఆమిర్ ఖాన్ కోసం విందు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో 'లాల్ సింగ్ చద్దా' సినిమాలో నాగ చైతన్య పాత్ర పేరు రివీల్ చేశారు. ఈ సినిమాలో ఖాన్‌తో స్క్రీన్ పంచుకున్నాడు నాగ చైతన్య. 'లాల్ సింగ్ చద్దా' సినిమాలో చైతు పాత్ర పేరు బాలరాజు అట. యాదృచ్ఛికంగా, నాగార్జున తండ్రి మరియు లెజండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 70 సంవత్సరాల క్రితం 'బాలరాజు' సినిమాలో అదే పేరుతో నటించారు. ఇది గుర్తు చేసుకొని నాగార్జున చాలా ఎమోషనల్ అయ్యారు.