Abn logo
Jan 15 2021 @ 13:07PM

సంక్రాంతి వేళ.. చిరంజీవి, నాగార్జున కలయిక

ఇప్పుడు స్టార్స్ రీ యూనియన్ చాలా కామన్ అయ్యింది. పండుగ‌లు, ఫంక్ష‌న్స్‌ను స్టార్స్ అంర‌దూ క‌లిసి సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ‌ను ఇద్ద‌రూ సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కులు క‌లిసి సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఇంత‌కీ ఆ సీనియ‌ర్ స్టార్స్ ఎవ‌రో కాదు.. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున‌. చిరంజీవి ఇంట జ‌రిగిన సంక్రాంతి వేడుక‌ల‌కు నాగార్జున ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. సంగీతం వింటూ విందు ఆర‌గిస్తూ సంక్రాంతి వేడుక‌ను సెల‌బ్రేట్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున స‌హా మెగా ఫ్యామ‌లీ హీరోలు రామ్‌చ‌ర‌ణ్‌, వ‌రుణ్‌తేజ్‌, సాయితేజ్‌, అల్లు శిరీశ్ ఇత‌ర కుటుంబ స‌భ్యులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement