Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 08 Aug 2022 08:03:24 IST

Nagarjuna : తనయుడితో చిత్రం?

twitter-iconwatsapp-iconfb-icon

ఈ ఏడాది సంక్రాంతికి ‘బంగార్రాజు’ (Bangarraju) చిత్రంలో నాగచైతన్య (Nagachaitanya) తో నాగార్జున (Nagarjuna) స్ర్కీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఈ ఇద్దరూ తాతా మనవళ్ళుగా అదరగొట్టారు. ఇందులోనే తండ్రిగానూ నాగచైతన్యతో కలిసి నటించారు నాగ్. ఇక ఇప్పుడు అఖిల్ (Akhil) వంతు వచ్చింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఒకే రకమైన కథతో వేరు వేరు చిత్రాలతో అభిమానుల్ని అలరించడానికి సిద్దమవుతున్నారు. ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో నాగార్జున ‘ది ఘోస్ట్’ (The Ghost) గా రానుండగా, సురేంద్ర రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో అఖిల్ ‘ఏజెంట్‌’ (Agent) గా యాక్షన్ కు రెడీ అవుతున్నాడు. అయితే ఈ ఇద్దరూ ఒకే సినిమాలో అందులోనూ తండ్రీ కొడుకులుగా నటిస్తే అదిరిపోతుంది కదూ. ప్రస్తుతం ఆ కాంబో మూవీకి రంగం సిద్ధమవుతోంది. 

‘ది ఘోస్ట్, ఏజెంట్’ చిత్రాలు రెండూ పూర్తయ్యాకా నాగార్జున, అఖిల్ కలయికలోని చిత్రం ప్రారంభం కానున్నదని సమాచారం. దీనికి తమిళ దర్శకుడు మోహన్ రాజా(Mohanraja) దర్శకత్వం వహించబోతున్నారు. ఓ వినూత్నమైన కథతో ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయి. స్ర్కిప్ట్ నచ్చడంతో నాగ్ ఓకే చెప్పారని టాక్. దీన్ని అన్నపూర్ణా స్డూడియోస్ లోనే నిర్మించబోతున్నారు. అఖిల్ పాకే వయసులోనే తండ్రి నాగార్జునతో ‘సిసింద్రీ’ (Sisindri) చిత్రంలో నటించాడు. ఆ తర్వాత మనం (Manam), అఖిల్ (Ahil) లాంటి చిత్రాల్లోనూ తండ్రితో స్ర్కీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు పూర్తి స్థాయిలో తండ్రితో కలిసి నటించనుండడం విశేషంగా మారింది. 

తాజా సమాచారం ప్రకారం మొన్నామధ్య మలయాళంలో విడుదలైన సూపర్ హిట్ చిత్రం‘బ్రోడాడీ’ (Brodaddy) కిది అఫీషియల్ రీమేక్ అని తెలుస్తోంది. మోహన్ లాల్ (Mohanlal), పృధ్విరాజ్ సుకుమారన్ (Pridhwiraj Sukumaran) తండ్రీకొడుకులుగా వినోదాన్ని పంచిన ఈ సినిమాను స్వల్ప మార్పులతో తెలుగు నేటివిటీకి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నట్టు సమాచారం. అనుకోని పరిస్థితుల్లో తండ్రీ కొడుకులిద్దరూ ఒకేసారి తండ్రులవుతారు. తన కొడుకు చేసిన తప్పును కప్పిపుచ్చడానికి మోహన్ లాల్ ఎలాంటి నాటకం ఆడారు అన్నదే ‘బ్రోడాడీ’ కథాంశం. తండ్రిని అన్నగా భావించే కొడుకు, తనయుడ్ని తమ్ముడిలా ట్రీట్ చేసే తండ్రి.. వీరిద్దరి మధ్యనున్న ఎమోషనల్ బాండింగ్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియదు కానీ..  ఈ ఇద్దరూ అలాంటి తండ్రీ కొడుకులుగా నటిస్తే అభిమానులకు పండగే.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement