Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 18 Jan 2022 17:25:46 IST

‘అలా పిలిస్తే’ NAGకి ‘గర్వం’గా ఉంటుందట!

twitter-iconwatsapp-iconfb-icon
అలా పిలిస్తే NAGకి గర్వంగా ఉంటుందట!

‘‘ఎప్పుడూ అలానే పిలుస్తుంటారు...’’ అంటున్నాడు కింగ్ ఆప్ టాలీవుడ్ నాగార్జున. ‘‘మిమ్మల్ని ఇప్పటికీ ‘సౌత్ యాక్టర్’ అని పిలుస్తుంటారా?’’ అంటూ ఆయన్ని బాలీవుడ్ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ‘‘ఆల్ ద టైం’’ అని జవాబిచ్చాడు! 


కొన్నాళ్ల క్రితం ‘అత్రంగీ రే’ సినిమా ప్రమోషన్స్ సమయంలో ధనుష్ తనని ‘సౌత్ యాక్టర్’ అనటంపై ఒకింత అసంతృప్తి వెలిబుచ్చాడు. యాక్టర్ ఎక్కడైనా యాక్టరే అంటూ వ్యాఖ్యానించాడు. కానీ, ‘బ్రహ్మాస్త్ర’తో బీ-టౌన్‌లోకి రీఎంట్రీ ఇస్తోన్న నాగార్జున మాత్రం ‘సౌత్ యాక్టర్’ అనిపించుకోవటం తనకు గర్వ కారణం అన్నాడు. ‘‘నేను ఢిల్లీలోనో, ముంబైలోనో ఏదైనా రెస్టారెంట్‌లోకి ప్రవేశిస్తే... ఇప్పటికీ... ‘వో సౌత్ కా యాక్టర్ హై (అతను దక్షిణాది నటుడు)’ అంటుంటారు’’ అని చెప్పాడు అక్కినేని స్టార్. అయితే, తనని అలా పిలవటం అభ్యంతరకరం  ఏం కాదని కూడా ‘మన్మథుడు’ అంటున్నాడు. సౌత్ యాక్టర్ అన్నప్పుడు ‘‘రియల్లీ ప్రౌడ్’’ ఫీలింగ్ కలుగుతుందని సగర్వంగా చెప్పాడు!  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...