‘దింపేసిన కారులో మళ్లీ ఎక్కాలని తహతహలాడుతున్నావా విజయసాయిరెడ్డి?’

ABN , First Publish Date - 2020-07-06T16:30:09+05:30 IST

అమరావతి: దింపేసిన కారులోకి మళ్లీ ఎక్కాలని తహతహలాడుతున్నావా విజయసాయిరెడ్డి?

‘దింపేసిన కారులో మళ్లీ ఎక్కాలని తహతహలాడుతున్నావా విజయసాయిరెడ్డి?’

అమరావతి: దింపేసిన కారులోకి మళ్లీ ఎక్కాలని తహతహలాడుతున్నావా విజయసాయిరెడ్డి? అని టీడీపీ నేత దేవతోటి నాగరాజు ప్రశ్నించారు. ట్విట్టర్లో అయిన దానికి, కాని దానికి కారుకూతలు కూస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూట్ కేస్ కంపెనీల సృష్టికర్తకు షాక్ తగిలి జగన్‌కు దూరం అయ్యాడని ఎద్దేవా చేశారు. మళ్లీ దగ్గర కావడానికి ట్విట్టర్లో మొరుగుతున్నాడంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. షాడో ముఖ్యమంత్రిలా కనిపించిన విజయసాయి రెడ్డి సోదిలో లేకుండా పోయాడన్నారు. మళ్లీ తెరపై కనిపించడానికి ట్విట్టర్లో ఊరేగుతున్నాడని నాగరాజు ఎద్దేవా చేశారు.

Updated Date - 2020-07-06T16:30:09+05:30 IST