Kollapurలో ఉద్రిక్తత.. హర్షవర్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు హౌస్ అరెస్టు
ABN , First Publish Date - 2022-06-26T15:52:02+05:30 IST
నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా: కొల్లాపూర్ (Kollapur)లో ఉద్రిక్తత చోటు చేసుకొంది.
నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా: కొల్లాపూర్ (Kollapur)లో ఉద్రిక్తత చోటు చేసుకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. కొల్లాపూర్లో జరిగిన అభివృద్దిపై బహరంగ చర్చపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally krishna rao), స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి (Harshavardhan Reddy)ల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకొన్నాయి. దీనిపై ఆదివారం ఇరువురి మధ్య చర్చ జరగనుంది. ఈ నేపథ్యలో బీరం హర్షవర్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను పోలీసులు హౌస్ అరెస్టు (House Arrest) చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘనలు జరగకుండా ప్రధాన కూడలిలో పోలీసులు భారీగా మోహరించారు.