Minister Wife: ఈ మంత్రి గారి భార్య కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-11T23:26:02+05:30 IST

ప్రపంచ జనాభా దినోత్సవం (World Population Day) సందర్భంగా నాగాలాండ్ మంత్రి తెమ్‌జెన్ ఇమ్నా(Temjen Imna Along) చేసిన ట్వీట్ నెటిజన్ల ముఖంలో నవ్వులు పూయించింది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా..

Minister Wife: ఈ మంత్రి గారి భార్య కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..

ప్రపంచ జనాభా దినోత్సవం (World Population Day) సందర్భంగా నాగాలాండ్ మంత్రి తెమ్‌జెన్ ఇమ్నా(Temjen Imna Along) చేసిన ట్వీట్ నెటిజన్ల ముఖంలో నవ్వులు పూయించింది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జనాభా పెరుగుదల లాంటి సునిశిత అంశంపై దృష్టి సారించాలని, పిల్లలను కనాలా.. వద్దా అనే విషయంలో ఉన్న ఎంపికలను ప్రజలకే వదిలేయాలని మంత్రి తెమ్‌జెన్ ఇమ్నా ట్వీట్ చేశారు. మంత్రి చెప్పిన ఈ విషయం వరకూ నవ్వుకోవడానికి ఏమీ లేదు. జనాభా పెరుగుదలపై సీరియస్‌గా ఆలోచన చేయాలని సదరు మంత్రి చెప్పారు. అయితే.. ఆ తర్వాత ఆయన ఆ ట్వీట్‌లో చెప్పిన విషయమే నెటిజన్ల ముఖంలో నవ్వులు పూయించింది. ‘‘జనాభా పెరుగుదల లాంటి సునిశిత అంశంపై ఆలోచన చేయండి లేదా నాలాగా #StaySingleలా ఒంటరి జీవనాన్ని గడుపుతూ సుస్థిరమైన భవిష్యత్‌‌ను నిర్మించడంతో మీ వంతుగా పాలుపంచుకోండి.. రండి.. మన సింగిల్ మూమెంట్‌లో (Singles Movement) ఇవాళే భాగం కండి’’ అని నాగాలాండ్ మంత్రి తెమ్‌జెన్ ఇమ్నా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ చూసి నెటిజన్లు నవ్వాపుకోలేకపోతున్నారు. మంత్రి చెబుతున్నట్టు ఆయన పెళ్లి చేసుకోకుండా ఉన్నారో, లేదో తెలుసుకునేందుకు Temjen Imna Along Wife అని గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు.



ఈ సెర్చ్ చేసిన విషయంపై కూడా ఈ నాగాలాండ్ మంత్రి ట్వీట్ చేశారు. ‘‘నేను కూడా ఇప్పటికీ తన కోసమే చూస్తున్నా’’ అని సరదాగా తెమ్‌జెన్ ఇమ్నా ట్వీట్ చేశారు. ఈ నాగాలాండ్ మంత్రి Sense Of Humour తెలిసి నెటిజన్లు ఆయనను మెచ్చుకుంటున్నారు. మంత్రి చేసిన ట్వీట్‌పై నెటిజన్లు కూడా అంతే సరదగా స్పందిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ‘You Will Never Have Joint Pain’ అని ఒక నెటిజన్ ట్వీట్ చేస్తే, ‘Finally We Have Leader Of Singles’ అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు. So that Google Search for Your Wife will Never be Complete అని, Govt should incentivise men for staying single అని నెటిజన్లు స్పందిస్తున్న తీరు మంత్రి చేసిన ట్వీట్ కంటే ఎక్కువ నవ్వులు పూయిస్తున్నాయి. ఈ కామెంట్స్ అన్నీ చూస్తుంటే త్వరలోనే భార్య కోసం మీరు చేస్తున్న అన్వేషణకు శుభం కార్డు పడేలా ఉందని, చాలా ప్రపోజల్స్ వచ్చే అవకాశం ఉందని.. ‘బెస్ట్ ఆఫ్ లక్’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.



ఇదిలా ఉంటే.. ఈ నాగాలాండ్ మంత్రిలో ‘జంధ్యాల’ తరహా హాస్యం చాలానే ఉంది. ఈ ట్వీట్ కంటే ముందు కూడా ఆయన చేసిన చాలా ట్వీట్స్ తెమ్‌జెన్ ఇమ్నాలో ఉన్న Sense Of Humourకు చక్కటి ఉదాహరణగా నిలిచాయి. నాగాలాండ్ ప్రజల కళ్లు కొంచెం చిన్నవిగా, లోపలికి ఉంటాయి. Northeast ప్రజల ముఖాలపై ఇప్పటికీ కొందరు జోకులేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి చురుక్కుమనేలా, కొంత నవ్వు తెప్పించేలా ఈ మంత్రి చేసిన ట్వీట్ అలాంటి కామెంట్స్ చేసేవారికి కొట్టినట్టు, మరికొందరు నెటిజన్లకు నవ్వు తెప్పించేట్టూ ఉంది. ‘‘నా కళ్లు చిన్నవిగా ఉండటం వల్ల నా కళ్లలోకి దుమ్ముధూళి తక్కువగా వెళుతుంది. సుదీర్ఘంగా ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు స్టేజ్‌పైనే నేను సులభంగా నిద్రపోవచ్చు’’ అని ఇమ్నా చేసిన ట్వీట్ నవ్వులను వెల్లివిరిసేలా చేసింది.

Updated Date - 2022-07-11T23:26:02+05:30 IST