నాగాలాండ్ ఘటనపై కోర్టు ఎంక్వయిరీకి ఆర్మీ ఆదేశం

ABN , First Publish Date - 2021-12-06T20:39:35+05:30 IST

నాగాలాండ్‌లో తీవ్రవాదులనుకొని భద్రతాబలగాలు పౌరులపైకి కాల్పులు జరిపిన ఘటనలో..

నాగాలాండ్ ఘటనపై కోర్టు ఎంక్వయిరీకి ఆర్మీ ఆదేశం

గువాహటి: నాగాలాండ్‌లో తీవ్రవాదులనుకొని భద్రతాబలగాలు పౌరులపైకి కాల్పులు జరిపిన ఘటనలో 14 మంది దుర్మరణం పాలైన ఘటనపై కోర్టు ఎంక్వైరీ (మార్షల్)కి భారత సైన్యం ఆదేశించింది. మేజర్ జనరల్ ర్యాంకు అధికారి నేతృత్వంలో ఈ విచారణ జరగనున్నట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఆ ఘటనలో గ్రామస్థుల మృతదేహాలను గుర్తించిన యువకులు ఆగ్రహంతో రెండు మిలటరీ వ్యాన్లకు నిప్పు పెట్టడంతో ఓ జవాను కూడా చనిపోయాడు.


కేంద్రం సాయం రూ.11 లక్షలు, రాష్ట్రం నుంచి రూ.5 లక్షలు

కాగా, నాగాలాండ్ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.11 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్టు ముఖ్యమంత్రి  నేఫియూ రియో ప్రకటించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో తాను మాట్లాడానని, ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారని సీఎం తెలిపారు. రాష్ట్రం నుంచి సాయుధ బలగాల (ప్రత్యేక అధికారులు) చట్టాన్ని ఉపసంహరించాలని కూడా కేంద్రాని నేఫియూ రియో కోరారు. ఈ చట్టం దేశ ప్రతిష్టను మసకబారుస్తోందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-12-06T20:39:35+05:30 IST