తాండూరు రూరల్, జనవరి 27 : అటవీ డిప్యూటీ రేంజ్(తాండూరు) అధికారిగా నాగజ్యోతి గురువారం బాధ్యతలు చేపట్టారు. కాగా, ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన డిప్యూటీ రేంజ్ అధికారి తాజొద్దీన్ గద్వాలా జోగుళాంబ జిల్లాకు బదిలీపై వెళ్లారు. అదేవిధంగా మహబూబ్‌నగర్ జిల్లా మహ్మదాబాద్ అటవీ రేంజ్‌లో పనిచేస్తున్న నాగజ్యోతి తాండూరు అటవీ రేంజ్‌కు డిప్యూటీ రేంజ్ అధికారిగా బదిలీపై వచ్చారు.