Abn logo
Sep 21 2020 @ 12:21PM

స్పోర్ట్స్‌ డ్రామాలో చైతన్య..!

Kaakateeya

అక్కినేని కథానాయకుడు నాగచైతన్య ఇప్పుడు శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న 'లవ్‌స్టోరి' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి కాగానే విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందబోయే 'థాంక్యూ' చిత్రంలో నటించబోతున్నారు నాగచైతన్య. ఈ సినిమా 2021 ప్రథమార్థంలో పూర్తవుతుంది. తదుపరి చైతన్య ఎవరి దర్శకత్వంలో నటిస్తారనే దానిపై క్లారిటీ లేదు. మోహనకృష్ణ ఇంద్రగంటి, నందినీ రెడ్డిలలో ఎవరితో అయినా సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తాజాగా మరో దర్శకుడు కూడా చైతన్య తదుపరి సినిమాను చేయబోయే డైరెక్టర్స్‌ లిస్టులో చేరారు. ఆయనెవరో కాదు.. వెంకీ అట్లూరి. రీసెంట్‌గా చైతును కలిసిన వెంకీ అట్లూరి ఓ స్పోర్ట్స్‌ డ్రామాను ప్లాట్‌ను చెప్పారట. చైతుకు కూడా నచ్చిందని, స్క్రిప్ట్‌ తయారుచేయమన్నారని టాక్‌ వినిపిస్తోంది. మరి చైతన్యని ఫైనల్ స్క్రిప్ట్‌తో వెంకీ అట్లూరి మెప్పిస్తే తదుపరి చైతన్యతో సినిమా చేసే అవకాశం దక్కినేట్టేనని వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. 


Advertisement
Advertisement
Advertisement