Abn logo
Sep 29 2021 @ 02:45AM

Pawan Kalyan గురించి గతంలో Posani మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసిన Nagababu.. మీమ్స్‌తో సెటైర్లు

కుక్క మొరిగిందనుకో!

పోసాని వ్యాఖ్యలకు ‘మీమ్‌’తో నాగబాబు జవాబు

ఇన్‌స్టాలో అభిమానులతో చిట్‌చాట్‌

మీమ్స్‌, వీడియోలతోనే ఆసక్తికర సమాధానాలు


హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): అటు ఏపీ మంత్రులు, ఇటు పోసాని కృష్ణ మురళి తన సోదరుడు పవన్‌ కల్యాణ్‌పై చేస్తు న్న విమర్శలకు నాగబాబు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ఏదీ సూటిగా చెప్పకుం డా... మీమ్స్‌, ఇమోజీలు, వీడియోల రూపంలో తాను చెప్పాల్సింది చెప్పారు. మంగళవారం పోసాని కృష్ణ మురళి వరుసగా రెండోరోజు పవన్‌పై విరుచుకుపడిన అనంతరం... నాగబాబు ‘ఆస్క్‌ మీ’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమాను ల ముందుకు వచ్చారు. ‘మళ్లీ పాలిటిక్స్‌లో వ స్తారా అంకుల్‌’ అనే ప్రశ్నకు... ‘నాకు ఇంట్రెస్ట్‌ పోయింది’ అనే మీమ్‌తో ఆన్సర్‌ ఇచ్చారు. ‘పవన్‌ కల్యాణ్‌ మేటర్‌ మాట్లాడు అన్నా’ అని ఓ అభిమాని అడిగితే... గతంలో పవన్‌ గురించి పోసాని కృష్ణమురళి మాట్లాడిన వీడియో పోస్ట్‌ చేశారు. ‘‘పవన్‌కల్యాణ్‌ ఈ రోజు మళ్లీ సినిమా హీరోగా యాక్ట్‌ చేస్తానంటే.. నేను అతనికి బ్లాం క్‌ చెక్‌ ఇస్తా. ఎన్ని సున్నాలైనా పెట్టుకోవచ్చు. కోటా, రెండు కోట్లా, పది కోట్లా, ఇరవై కోట్లా, 30 కోట్లా! 40 కోట్లు కూడా ఇస్తా. నాకు డేట్స్‌ ఇస్తే. అంత డిమాండ్‌ ఉన్న హీరో. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు, ఇండియాలోని టాప్‌ హీరోల్లో అతనొకరు.


అతను ఐదు కోట్లు, పది కోట్ల కోసం లంగా పనులు చేయడు. నాకు తెలుసు’’ అని అందులో పోసాని అన్నారు. మరో నెటిజన్‌ ‘సార్‌... ఏపీ మూవీ టికెట్స్‌ గురించి మీ అభిప్రాయం ఏమిటి?’ అని ప్రశ్నించగా... ‘విక్రమార్కుడు’ చిత్రంలో రవితేజ, బ్రహ్మానందం మో సాలు చేసి డబ్బులు పంచుకునే సన్నివేశాన్ని పోస్ట్‌ చేశారు. ‘చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఎప్పుడైనా సరిగా పంచావ్‌రా!’ అంటూ బ్రహ్మానందం వాపోయే సీన్‌ చూపించారు. ‘మోసం చేసినవాడు బాగుపడడురా!’ అని బ్రహ్మానందం శపించగా... ‘ఆ మనం చేసేది గుళ్లో పూజ మరి’ అని రవితేజ లైట్‌ తీసుకుంటాడు.


ప్రశ్నలకు నాగబాబు సమాధానాలు

ప్రశ్న: పోసాని గురించి ఒక్క మాట!

జవాబు: ‘సమరసింహారెడ్డి’లో బాలకృష్ణ ఫొటో పోస్ట్‌ చేశారు. ఆ సన్నివేశంలో డైలాగ్‌... ‘కుక్కపిల్ల మొరిగిందనుకో’!


ప్రశ్న: సన్నాసి నాని గురించి చెప్పు!

జవాబు: ‘నేనేం చెప్పాలి. దేశంలో ఈ అవార్డులనేవి వస్తే ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులూ రావాలి. ఆస్కార్‌కు కూడా వెళ్లే అవకాశం ఉంది. అయ్యప్పస్వామి సాక్షిగా అటువంటి పర్ఫార్మెన్స్‌ చూడలేదు’ అని ‘గుండెల్లో గోదావరి’ ఆడియో వేడుకలో మోహన్‌బాబు వీడియో పోస్ట్‌ చేశారు. 


ప్రశ్న: మీరు ఏ బ్రాండ్‌ తాగుతారు?

జవాబు: ‘ప్రెసిడెంట్‌ మెడల్‌, ఆంధ్రా గోల్డ్‌, గెలాక్సీ, బూమ్‌ బూమ్‌’ ఫొటోలు పోస్ట్‌ చేశారు. 


ప్రశ్న: పవన్‌ స్పీచ్‌పై మీ స్పందన ఏమిటి?

జవాబు: ‘ఒక శివమణి జాబ్‌ కొట్టినట్టు... ఒక జాకీర్‌ హుస్సేన్‌ తబలా కొట్టినట్టు... శంకర్‌ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ వాయించినట్టు... కొట్టుడు పాడించుడు... కొట్టుడు పాడించుడు’ అంటూ ‘కింగ్‌’ చిత్రంలో బ్రహ్మానందాన్ని శ్రీహరి కొట్టిన తీరును శ్రీనివాసరెడ్డి వివరించే సన్నివేశం వీడియో పోస్ట్‌ చేశారు.