Oct 13 2021 @ 13:49PM

Nagababu: మా అన్నయ్య పెదరాయుడిలా తీర్పులు ఇవ్వాలనుకోలేదు..

‘మా’ అన్నయ్య చేతనైన సాయం చేస్తాడు కానీ...

పెదరాయుడిలా తీర్పులు ఇవ్వాలనుకోలేదు..

పెద్దరికం చలాయిస్తానని ఎప్పుడూ చెప్పలేదు..

అంత అహంకారం ఆయనకు లేదు

– నాగబాబు


‘మా’ ఎన్నికల వేడి ఇప్పట్లో తగ్గలా లేదు. మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌పై గెలిచిన అనంతరం మెగా బ్రదర్‌, నాగబాబు ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన సపోర్ట్‌ చేసిన ప్యానల్‌లో గెలిచిన సభ్యులంతా నిన్న తమ పదవులకు రాజీనామా చేశారు. నమ్మి ఓట్లు వేసిన వారి వెంట ఉంటామన్నారు. పొరపాట్లు జరిగితే బయటి నుంచి ప్రశ్నిస్తామని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వివాదాలు ముదిరేలా కనిపిస్తున్నాయి కానీ తగ్గుముఖం పట్టేలా ఎక్కడా కనిపించడం లేదు. తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో పాలొన్న  నాగబాబు ‘మా’ ఎన్నికలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను ‘మా’ అసోసియేషన్‌ సభ్యుడిగా కొనసాగాలనుకోవడం లేదని మరోసారి స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు పెద్దగా వ్యవహరించాలని మా అన్నయ్య ఎప్పుడూ అనుకోలేదు. పరిశ్రమకు చెందిన నటీనటులు, ఇతర వ్యక్తులు ఇలా ఎవరైనా కష్టమంటూ మా ఇంటికి వేస్త ఆయన తనకు చేతనైనంత సాయం చేశారు. అంతే తప్ప పెదరాయుడిలా సింహాసనంపై కూర్చొని పెద్దరికం చలాయిస్తానని ఎప్పుడూ అనలేదు. ఆయనకు అంత అహంకారం లేదు’ అని నాగబాబు అన్నారు. 


ఆయన మాట్లాడుతూ ‘‘జనరల్‌ ఎలక్షన్‌లలో ఎలాంటి కుట్రలు జరుగుతాయో అవన్నీ ‘మా’ ఎన్నికల్లో జరిగాయి. సభ్యుల సంక్షేమం, అసోసియేషన్‌ అభివృద్థికి ఎలాంటి కార్యక్రమాలు చేపడతాం అన్న విషయాలతో ఎన్నికల్లో నిలబడతారు. ప్రాంతీయవాదం, కులంతోయ ప్రకాశ్‌రాజ్‌ వృత్తిపరమైన విషయాలను తెరపైకి తీసుకువచ్చి పర్సనల్‌ ఇమేజ్‌కి ఇబ్బందికలిగేలా ఎదుటి ప్యానల్‌ సభ్యులు  కామెంట్‌ చేశారు.  అతనికి సపోర్టర్‌గా నేను వారికి కౌంటర్‌ ఇచ్చాను. ఇన్నాళ్లు ఈ అసోసియేషన్‌లో భాగమైనందుకు ఎంతో గర్వంగా ఫీలయ్యాను. తెలుగువాళ్లకు ప్రాంతీయవాదం ఉండదు. మంచి హృదయంతో వ్యవహరిస్తారనుకున్నా. కానీ, ఎన్నికల తర్వాత ఇలాంటి సంకుచితమైన అసోసియేషన్‌లో ఉండాలనిపించలేదు. అలందుకే మనస్థాపంతో బయటకు వచ్చేశాను. ఇకపై ఈ అసోసియేషన్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. మరో అసోసియేషన్‌ పెట్టే ఆలోచన తమ కుటుంబానికి లేదు’’ అని అన్నారు.