Abn logo
May 23 2020 @ 08:56AM

తదుపరి సినిమాను ఓకే చేసిన నాగశౌర్య!

Kaakateeya

హీరో నాగశౌర్య ‘ఛలో’ సినిమాతో నిర్మాతగా మారాడు. ఆ సినిమా మంచి సక్సెస్‌ను సాధించింది. తర్వాత చేసిన ‘నర్తనశాల’ డిజాస్టర్ అయ్యింది. మూడో చిత్రంగా ఐరా క్రియేషన్స్‌లో రూపొందిన చిత్రం ‘అశ్వథ్థామ’ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే ఈసారి ఎలాగైనా హిట్ సాధించాలనే ఆలోచనతో నాగశౌర్య ప్రణాళికలు వేసుకుంటున్నాడు. తాజా సమాచారం మేరకు ఐరా క్రియేషన్స్ బ్యాన‌ర్‌లో ‘అలా ఎలా’ ఫేమ్ అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ యువ హీరో సినిమా చేయ‌బోత‌ున్నాడ‌ట‌. అంతే కాకుండా మ‌రో హీరో తో సినిమాను నిర్మించ‌డానికి నాగశౌర్య స‌న్నాహాలు చేస్తున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

 

Advertisement
Advertisement
Advertisement