Aug 22 2021 @ 08:55AM

నాగ చైతన్యతో 'నాంది' దర్శకుడు..?

అక్కినేని నాగ చైతన్యతో 'నాంది' చిత్ర దర్శకుడు ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. చైతూ నటించిన 'లవ్ స్టోరి' రిలీజ్ కి సిద్దమవుతోంది. అలాగే 'థాంక్యూ' సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్న ఆయన, హిందీలో డెబ్యూ మూవీ 'లాల్ సింగ్ చద్దా'లో ఆమిర్ ఖాన్‌తో కలిసి తెరను పంచుకోబోతున్నాడు. ఇక తండ్రి నాగార్జునతో కలిసి 'సోగ్గాడే చిన్ని నాయనా' ప్రీక్వెల్ బంగార్రాజులో నటించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఇదే క్రమంలో విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ దర్శకుడు 'నాంది' సినిమాతో అల్లరి నరేశ్‌కి భారీ హిట్ ఇచ్చాడు. నరేశ్‌కి మైన్ స్టోన్ మూవీని ఇచ్చిన విజయ్ కనకమేడల టాలీవుడ్‌లో క్రేజీ డైరెక్టర్‌గా మారాడు. కాగా ఆయన చెప్పిన కథ చైతూకి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సమంత ఇందులో హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయని సమాచారం. త్వరలో దీనిపై స్పష్ఠత రానుందంటున్నారు.