Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 10 Aug 2022 18:04:52 IST

Naga Chaitanya: ఆ జ్ఞాపకాలు.. జీవితాంతం ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటాయి

twitter-iconwatsapp-iconfb-icon

వయాకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్షన్స్ బ్యానర్లపై మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ (Aamir Khan), కరీనా కపూర్ (Kareena Kapoor), అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya)  ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తుండగా.. గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. టాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్య ఈ సినిమాలో  బాలరాజు (Balaraju) పాత్రలో నటించారు. సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు మంచి స్పందనను రాబట్టుకుంటుండగా.. తాజాగా నాగచైతన్య ఈ సినిమా విశేషాలను మీడియాకు తెలియజేశారు. చైతూ చెప్పిన ‘లాల్ సింగ్ చడ్డా’ విశేషాలివే.. (Naga Chaitanya Interview)


‘‘ఆమిర్ ఖాన్ వంటి హీరోతో కలసి నటించడం చాలా గొప్పగా ఫీలవుతున్నాను. ఆయనతో నటించడం ద్వారా నేను ఎంతో నేర్చుకొన్నాను. కొన్ని సినిమాల ద్వారా పొందిన అనుభవం, జ్ఞాపకాలు జీవితాంతం మనకు ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటాయి. అలాంటిదే ఈ సినిమా. ఈ చిత్రంలో నా పాత్ర కేవలం 20 నుంచి 30 నిమిషాలు మాత్రమే లాల్ (ఆమిర్ ఖాన్)తో కలిసి ఉంటుంది.

Naga Chaitanya: ఆ జ్ఞాపకాలు.. జీవితాంతం ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటాయి

ఈ సినిమా అవకాశం గురించి చెప్పాలంటే.. ఫస్ట్ టైం నాకు కాల్ వచ్చినప్పుడు నేను నమ్మలేదు. సాయంత్రం ఆమిర్ ఖాన్‌గారు, డైరెక్టర్ అద్వైత్ చందన్ వీడియో కాల్ చేసి మాట్లాడినప్పుడు నాకు చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఇలాంటి పాత్ర చేయడం చాలా కష్టం. ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది. ఆమిర్ ఖాన్‌గారు ప్రి ప్రొడక్షన్‌కు చాలా టైమ్ తీసుకోవడం వలన.. ఆ తర్వాత తనకు షూట్ చాలా ఈజీ అవుతుంది. అది నాకు చాలా బాగా నచ్చింది. సినిమాలో లాల్ పాత్రలో నటించిన ఆమిర్‌‌గారికి ఎన్ని కష్టాలు వచ్చినా బయటికి చూయించకుండా అద్భుతంగా నటించారు. క్రమశిక్షణ కలిగిన పర్ఫెక్షన్ ఉన్నటువంటి వ్యక్తి. తనతో నటించడం వలన తననుండి చాలా నేర్చుకున్నాను.


ఈ చిత్రంలో నా పాత్ర పేరు బాలరాజు. ఆ పేరు కూడా నాకు స్పెషల్‌గా అనిపించింది.1948లో తాతగారు ఈ టైటిల్‌తో నటించిన చిత్రం సూపర్ హిట్ అయ్యిందని తెలిసి.. నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను.. కారణం తాతగారి ఆశీస్సులు కూడా వున్నట్టు అనిపించింది. గుంటూరు జిల్లాలోని బోడిపాలెం దగ్గర పుట్టిన బాలరాజు ఆర్మీలో జాయిన్ అయిన విధానం ఇందులో చాలా చక్కగా చూపించడం జరిగింది. ఇందులో తెలుగు నేటివిటీ చాలావరకూ కనిపిస్తుంది. ఈ సినిమాను తెలుగు జిల్లాలలో కూడా షూటింగ్ చేయడం జరిగింది. చిరంజీవిగారు పర్సనల్‌గా తీసుకొని ఈ సినిమాని విడుదల చేయడం చాలా గొప్ప విషయం. ఆయన ఈ సినిమాని సమర్పిస్తున్నందుకు చాలా హ్యాపీ. ఇప్పటివరకు ఈ సినిమా చూసిన వారందరూ చాలా బాగుందని రివ్యూస్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి (Chiranjeevi)గారు, నాన్న (Nagarjuna).. నా పాత్ర మాత్రమే కనిపించిందని అంటే చాలా చాలా సంతోషంగా అనిపించింది. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారని.. ఈ మధ్య వచ్చిన రెండు సినిమాలు నిరూపించాయి. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చడమే కాకుండా చూసిన ప్రతి భారతీయుడికి రిలేట్ అవుతుందని ఆశిస్తున్నాను.


‘వెంకీ మామ’ చిత్రంలో నేను ఆర్మీ క్యారెక్టర్ చేసినా.. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఈ చిత్రంలో కార్గిల్‌లో జరిగిన ఒక సీన్‌ను తీసుకొని చేయడం జరిగింది. ఇందులో కార్గిల్ వార్ సీక్వెన్స్ ఉంటాయి. హిందీలో ఇదే నా పరిచయం చిత్రం. అక్కడ కూడా నా మార్కెట్ పెరుగుతుంది కాబట్టి చాలా ఆనందంగా ఉన్నా కూడా.. పాన్ ఇండియా మూవీ కావడంతో నాకు చాలా నెర్వస్‌గా ఉంది. ఇది 1975 నుంచి తీసుకున్న సినిమా.. కానీ పిరియాడిక్ మూవీ కాదు.

Naga Chaitanya: ఆ జ్ఞాపకాలు.. జీవితాంతం ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటాయి

సినిమా ఇండస్ట్రీ అనేది చాలా క్రియేటివ్ ఫీల్డ్. టెక్నికల్‌గా ఇక్కడికి అక్కడికి (టాలీవుడ్-బాలీవుడ్) తేడా అనేది ఏమీ లేదు. ఈ విషయంలో నేనెప్పుడూ కంపేర్ చేసుకోను. ఒక్కో డైరెక్టర్‌కి ఒక్కొ విజన్, క్రియేటివిటీ ఉంటుంది. అంతే కానీ వారిని వీరిని పోల్చలేను. డైరెక్టర్ అద్వైత్ చందన్ చాలా మంచి డైరెక్టర్.. తను నన్ను చాలా బాగా గైడ్ చేశాడు.


నాకు స్పెషల్ క్యారెక్టర్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు నేను స్పెషల్ క్యారెక్టర్స్ అంటూ ఏమి చేయలేదు. ఇందులోనే మొదటిది. ఇకముందు కూడా ఇలాంటి మంచి క్యారెక్టర్ వస్తే చేస్తాను. అయితే ఆమిర్‌గారి పక్కన చేయడం హ్యాపీగా వుంది. ఆయన పక్కన చేసిన వారంతా కచ్చితంగా షైన్ అవుతారు. ఆయన సినిమాలను గమనిస్తే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా హైలెట్ ఉంటుంది. ఆయన క్యారెక్టర్‌తో పాటు.. పక్కన ఉన్న క్యారెక్టర్‌కు కూడా విశిష్టత ఉంటుంది. ఆయన ఆన్ సెట్‌లో, ఆఫ్ సెట్‌లో కూడా ఒకేలా ఉంటారు. కెమెరా ఆఫ్ చేసినా కూడా ఆయన పాత్ర నుంచి బయటకు రారు.. అంత డెడికేటెడ్‌గా ఉంటారు. త్వరలోనే నా తదుపరి చిత్రాలను ప్రకటిస్తాను..’’ అని నాగచైతన్య  చెప్పుకొచ్చారు. కాగా, హాలీవుడ్‌లో సూపర్ హిట్ అయినటువంటి ‘ఫారెస్ట్ గంప్’ సినిమా ఆధారంగా ఈ ‘లాల్ సింగ్ చడ్డా’ చిత్రం రూపొందింది. (Naga Chaitanya Laal Singh Chaddha Interview)


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement