అక్కినేని నాగ చైతన్య మొదటిసారి జర్నలిస్ట్ పాత్రలో నటించనున్నాడని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇటీవలే 'లవ్ స్టోరి' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చైతూ ఇప్పటికే 'థ్యాంక్యూ' చిత్రాన్ని పూర్తి చేశాడు. ప్రస్తుతం తండ్రి నాగార్జునతో కలిసి 'బంగార్రాజు' మూవీలో నటిస్తున్నాడు. ఇక డిజిటల్ ఎంట్రీ ఇస్తూ ఓ వెబ్ సిరీస్‌లో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ నిర్మించబోతున్న దీనికి 'మనం' ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో చైతూ క్యారెక్టర్ జర్నలిస్ట్ అని తెలుస్తోంది. ఇప్పటివరకు ఇలాంటి పాత్రలో తను నటించలేదు. ఇక ఈ కథ, అందులో క్యారెక్టర్‌ను దర్శకుడు విక్రమ్ కె. కుమార్ నరేట్ చేయగానే చైతూ చాలా ఎగ్జైట్ అయ్యాడట. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఇతర నటీనటులు.. మిగతా విషయాలను త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.