Oct 22 2021 @ 10:08AM

మోహన కృష్ణ ఇంద్రగంటి, నందిని రెడ్డి దర్శకత్వంలో నాగ చైతన్య..?

ఇటీవలే 'లవ్ స్టోరి' మూవీతో వచ్చి మంచి హిట్ అందుకున్న అక్కినేని నాగ చైతన్య వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే బాలీవుడ్ మూవీ 'లాల్ సింగ్ చద్దా', తెలుగులో 'థ్యాంక్యూ' సినిమాలను పూర్తి చేశాడు. ఈ రెండు సినిమాల రిలీజ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మరో రెండు సినిమాలను సెట్స్‌పైకి తీసుకురాబోతున్నాడట చైతూ. అందులో ఒక చిత్రానికి మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించబోతుండగా..మరొక చిత్రానికి లేడీ డైరెక్టర్ బీ.వీ నందిని రెడ్డి దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్‌కు నాగ చైతన్య ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో నిర్మించే చిత్రానికి నందిని రెడ్డి దర్శకురాలని ..ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోందని సమాచారం. ఇక త్వరలో తండ్రి నాగార్జునతో కలిసి 'బంగార్రాజు' మూవీ సెట్‌లో చైతూ జాయిన్ కానున్నాడట. మొత్తానికి వరుస ప్రాజెక్ట్స్‌తో వచ్చే ఏడాది మొత్తం ఈ అక్కినేని హీరో ఫుల్ బిజీగా ఉండబోతున్నాడు.