అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaitanya) ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ (Vikram k Kumar ) దర్శకత్వంలో ‘థాంక్యూ’ (Thnak You) అనే థ్రిల్లర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో క్రికెటర్ గానూ, మహేశ్ బాబు (Mahesh babu) వీరాభిమానిగానూ చైతూ కనిపించబోతున్నాడు. విక్రమ్ దర్వకత్వంలోనే ‘దూత’ (Dootha) అనే క్రైమ్ వెబ్‌సిరీస్ తోనూ రాబోతున్నాడు. నాగచైతన్యకిది తొలి డిజిటల్ ఎంట్రీ. ఇంకా.. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు, నందిని రెడ్డి దర్శకత్వంలోనూ నటిస్తున్నాడు. అలాగే బొమ్మరిల్లు భాస్కర్ తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. అయితే వీళ్ళందరి కన్నా ముందు చైతూ కమిట్మెంట్ ఇచ్చిన దర్శకుడు పరశురామ్. ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ తర్వాత పరశురామ్ .. ఓ ఫ్యామిలీ లవ్ స్టోరీ రాసుకొని .. చైతూకి వినిపించగా.. అతడికి ఎంతగానో నచ్చి, సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సినిమా కొద్దిరోజల్లో అనౌన్స్ అవబోతోంది అనగా... పరశురామ్‌కు అనూహ్యంగా మహేశ్‌బాబు నుంచి కాల్ వచ్చింది. దాంతో పరశురామ్ మహేశ్‌తో ‘సర్కారువారి పాట’ చిత్రం బిజీలో పడిపోయాడు. ఇప్పుడు చిత్రం విడుదలైంది కాబట్టి.. పరశురామ్, చైతూ కాంబో మూవీ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. మొన్నీమధ్యే చిత్రం అఫీషియల్ గా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే.
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకి ‘నాగేశ్వరరావు’ (Nageswararao) అనే టైటిల్‌ను అప్పట్లో అనుకున్నారు. ఇప్పుడు అదే టైటిల్‌ను ఖాయం చేయబోతున్నారని సమాచారం. నాగచైతన్య ( Naga Chaitanya ) మధ్యతరగతి యువకుడిగా నటిస్తున్నట్టు టాక్. మిడిల్ క్లాస్ నేపథ్యంలో ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. పరశురామ్ (Parasuram) చిత్రాల్లో హీరోయిన్ కు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఈ సినిమాలో కూడా హీరోయిన్‌కు మంచి స్ర్కీన్ స్పేస్ ఉందట. ప్రస్తుతం పరశురామ్ కథానాయిక అన్వేషణలో ఉన్నట్టు వినికిడి. మరి మిడిల్ క్లాస్ ‘నాగేశ్వరరావు’ గా నాగచైతన్య మేకవర్ ఎలా ఉండబోతుందో చూడాలి.