Abn logo
Mar 28 2020 @ 22:03PM

‘సిసిసి’కి చైతూ రూ. 25 లక్షల విరాళం

కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి, దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించారు. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో ‘సి.సి.సి. మ‌న‌కోసం’ (క‌రోనా క్రైసిస్ చారిటీ మ‌న‌కోసం) అనే సంస్థ‌ను ఏర్పాటు చేశారు. తమ సినిమాలకు సర్వం సమకూర్చే రోజూవారి సినీ కార్మికులను ఈ సంస్థ ద్వారా ఆదుకునేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తుండటం శుభపరిణామం. తాజాగా ఈ సిసిసికి యువసామ్రాట్ నాగచైతన్య రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు.


ఈ సంస్థ (సి.సి.సి. మ‌న‌కోసం)కు ఇప్పటి వరకు రూ. 3.8 కోట్లు వచ్చినట్లుగా మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో తెలిపారు. తాజాగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి రూ. లక్ష, చైతూ రూ. 25 లక్షలు ఈ సంస్థకు ప్రకటించారు. చైతూకి మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement