Abn logo
Mar 8 2021 @ 16:22PM

ఈ ఫీలింగ్‌ కోసం రెండేళ్లు వెయిట్‌ చేశాం: నాగ్‌ అశ్విన్‌

నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలతో తెరకెక్కిన చిత్రం 'జాతిరత్నాలు'. అనుదీప్ కెవి దర్శకత్వంలో స్వ‌ప్న సినిమా ప‌తాకంపై 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా జాతి ర‌త్నాలు ప్రీ రిలీజ్ వేడుకను చిత్రయూనిట్ వ‌రంగ‌ల్‌లో గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ కార్య‌క్ర‌మానికి రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ముఖ్య అతిథిగా హాజ‌రై జాతిర‌త్నాలు టీమ్‌కు శుభాకాంక్షలు అందచేశారు.


ఈ కార్యక్రమంలో నిర్మాత నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ''వరంగల్‌ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మాస్క్‌లు వేసుకుని అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ సినిమాను సంవత్సరం పాటు రిలీజ్ చేయకుండా ఉంచుకున్నాం. ఇలాంటి ఫీలింగ్ కోసమే రెండేళ్లు మా దగ్గరే పెట్టుకున్నాం. ఇప్పుడు థ్యాంకింగ్ ప్రోగ్రాం పెట్టొద్దని అనుదీప్ అన్నాడు. రాహుల్, దర్శి, రధన్, ఫరియా.. కొన్ని సినిమాలు అలా కలిసి వస్తాయ్.. నవీన్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఎలాంటి పాత్రలు చేసినా వాటికి తగ్గట్టు ఉంటాడు. ఏజెంట్ పాత్ర చేస్తే ఏజెంట్‌లా.. జోగిపేట కుర్రాడిలా.. ఇలా ఏ పాత్ర చేసినా అలానే కనిపిస్తాడు. విజయ్ కూడా అంతే.. ఒకే నాణెనికి రెండు వైపులున్నట్టు ఉంటారు. ఈవెంట్‌కు వచ్చినందుకు థ్యాంక్స్ విజయ్. ఏసీపీ జితేందర్‌గారికి ధన్యవాదాలు. ఇంత పెద్ద ఈవెంట్‌ను జాగ్రత్తగా నిర్వహించినందుకు థ్యాంక్స్. ఈ చిత్రానిక పనిచేసిన ప్రతి ఒక్కరికీ, అలాగే ఈ ఈవెంట్‌ ఇంత గ్రాండ్‌ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.." అని అన్నారు.

Advertisement
Advertisement
Advertisement