ఇజ్రాయెల్‌ ప్రధానిగా బెన్నెట్‌ ప్రమాణం

ABN , First Publish Date - 2021-06-14T07:09:04+05:30 IST

ఇజ్రాయెల్‌ నూతన ప్రధానమంత్రిగా నఫ్తాలీ బెన్నెట్‌ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు 27 మంది మంత్రులు ప్రమాణం చేశారు...

ఇజ్రాయెల్‌ ప్రధానిగా బెన్నెట్‌ ప్రమాణం

జెరూసలెం, జూన్‌ 13: ఇజ్రాయెల్‌ నూతన ప్రధానమంత్రిగా నఫ్తాలీ బెన్నెట్‌ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు 27 మంది మంత్రులు ప్రమాణం చేశారు. వీరిలో 9 మంది మహిళలు ఉన్నారు. కాగా, వరుసగా 12 ఏళ్లపాటు ప్రధానిగా కొనసాగిన బెంజమిన్‌ నెతన్యాహు(71).. ఇటీవలి ఎన్నికల్లో సాధారణ మెజారిటీ సాధించలేకపోయారు. దీంతో భిన్న సిద్ధాంతాలు కలిగిన పలు పార్టీలు కూటమిగా ఏర్పడి బెన్నెట్‌(49) సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 

Updated Date - 2021-06-14T07:09:04+05:30 IST