Abn logo
Sep 27 2020 @ 18:38PM

త్రివిక్రమ్‌ ఆ అవకాశం ఇచ్చినందుకు గర్వంగా ఉంది: నదియా

Kaakateeya

సీనియర్ నటి నదియా ఒకప్పుడు హీరోయిన్‌గా ఎన్నో చిత్రాలలో అలరించింది. అయితే ఆమె అందరికీ నోటెడ్‌ అయింది మాత్రం 'మిర్చి', 'అత్తారింటికి దారేది' చిత్రాలతోనే. ముఖ్యంగా 'అత్తారింటికి దారేది' చిత్రంలో ఆమెకు నటనకు స్కోప్ ఉన్న మంచి పాత్ర దక్కడంతో పాటు, టైటిల్‌ కూడా ఆమెనే హైలెట్‌ చేసేలా ఆ చిత్రం తెరకెక్కింది. విడుదలకు ముందే ఈ చిత్రం లీక్‌ అయినప్పటికీ.. బాక్సాఫీస్‌ వద్ద ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ చిత్రంలో అత్తా అల్లుడు రిలేషన్‌ని ఎంతో గొప్పగా చూపించారు డైరెక్టర్‌ త్రివిక్రమ్‌.  'అత్తారింటికి దారేది' చిత్రం విడుదలై 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రాన్ని తలచుకున్నారు నటి నదియా.

''ప్రముఖ దర్శకుడు, స్కిప్ట్ రైటర్‌ త్రివిక్రమ్‌గారు ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించినందుకు గర్వంగా ఫీలవుతున్నాను. అద్భుతమైన నటులు ముఖ్యంగా పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్ మరియు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులతో పనిచేసే అవకాశం లభించినందుకు గౌరవంగా భావిస్తున్నాను.." అని నదియా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


Advertisement
Advertisement
Advertisement