నందు విజయ్‌కృష్ణ, రష్మి గౌతమ్ జంటగా నటించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’. ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ సాహిత్యం అందించిన ‘నడికుడి రైలంటి సోదరా.. నడకన నీ సాటే లేరురా..’ అంటూ సాగే పాటను ఇటీవల హీరో సుధీర్ బాబు విడుదల చేశారు. ప్రశాంత్ విహారి సంగీతం అందించిన ఈ పాటను వైకామ్ విజయలక్ష్మి ఆలపించారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘‘సాంగ్ ప్రామిసింగ్‌గా ఉంది. నందు ఈ చిత్రంలో కొత్తగా కనిపిస్తున్నాడు. సినిమా సక్సెస్ కావాలి’’ అని అన్నారు. రాజ్ విరాట్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మాతలు.