కరోనా పట్ల వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN , First Publish Date - 2021-05-18T05:50:24+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో కరోనా నియంత్రణలో వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలకై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగూరు ఆర్థర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా పట్ల వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

  1. రివ్యూ సమావేశంలో ఎమ్మెల్యే ఆర్థర్‌


కొత్తపల్లి, మే 17:
గ్రామీణ ప్రాంతాల్లో కరోనా నియంత్రణలో వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే  చర్యలకై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగూరు ఆర్థర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే వివిధ శాఖల అధికారులు, వైద్యులతో కొవిడ్‌పై రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ ఎర్రమఠం, కొత్తపల్లి, గోకవరం వైద్యులు కరోనా పరీక్షలు చేయ డం,  వ్యాక్సిన్‌  వేయడంలో  విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి, రెండవ విడతలో ఎంత మందికి వ్యాక్సిన్‌లు వేశారని,  ఎంత మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు? అని పాజిటివ్‌ కేసులు ఎన్ని అని వైద్యులపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై వైద్యులు మౌనంగా ఉండి పోయారు. ఎంపీడీవో, తహసీల్దార్‌ల పర్యవేక్షణ సరిగా లేదని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో చంద్రశేఖర్‌, ఈవోఆర్డీ శ్రీనివాస నాయుడు, ఏఈలు రామ చంద్రయ్య, సువర్చల, వైద్యులు వినోద్‌కుమార్‌, శ్రీనివాసులు, జగదీష్‌ కుమార్‌, ఎస్‌ఐ నవీన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-18T05:50:24+05:30 IST