20న నడిగర్‌ సంఘం ఎన్నికల ఓట్ల లెక్కింపు

ABN , First Publish Date - 2022-03-13T14:13:48+05:30 IST

మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 20వ తేదీన దక్షిణ భారత నడిగర్‌ సంఘం ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికలు 2019లోనే జరిగిన విషయం తెలిసిందే. అయితే, సంఘంలోని

20న నడిగర్‌ సంఘం ఎన్నికల ఓట్ల లెక్కింపు

అడయార్‌(చెన్నై): మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 20వ తేదీన దక్షిణ భారత నడిగర్‌ సంఘం ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికలు 2019లోనే జరిగిన విషయం తెలిసిందే. అయితే, సంఘంలోని సభ్యుల్లో అనేకమంది పేర్లను తొలగించి ఎన్నికలు నిర్వహించారంటూ నటుడు ఏళుమలై మద్రాసు హైకోర్టును ఆశ్రయించడంతో ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది. ఇటీవల ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు గత నెల 23వ తేదీన తీర్పునిచ్చింది. ఎన్నికల్లో పోలైన ఓట్ల వరకు లెక్కించి ఫలితాలను నాలుగు వారాల్లో వెల్లడించాలని ఆదేశించింది. ఆ ప్రకారంగా ఈ నెల 20వ తేదీన ఈ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. స్థానిక నుంగంబాక్కం, కాలేజీ రోడ్డు, సుబ్బారావు అవెన్యూలో ఉన్న గుడ్‌ షెఫర్డ్‌ కాన్వెంట్‌ స్కూల్‌లో ఉదయం 8 గంటలకు ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు కేంద్రానికి కేవలం పోటీ చేసిన అభ్యర్థులను, వారి తరఫు ఏజెంట్లను మాత్రమే అనుమతించనున్నారు. అధ్యక్ష పదవికి సీనియర్‌ నటులు నాజర్‌, భాగ్యరాజ్‌ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2022-03-13T14:13:48+05:30 IST