Abn logo
May 17 2021 @ 03:54AM

లోక్‌సభ స్పీకర్‌ సుమోటోగా విచారణ జరపాలి

  • ఎంపీపై అధికారుల తీరు బ్రీచ్‌ ఆఫ్‌ ప్రివిలేజ్‌గా గుర్తించాలి: నాదెండ్ల 

అమరావతి, మే 16 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్ర ప్రభుత్వం నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో వ్యవహరించిన తీరును ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ గర్హించాలి. ఒక పార్లమెంటు సభ్యుడికి ఉన్న హక్కులను కొందరు అధికారులు పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించారు. బ్రీచ్‌ ఆఫ్‌ ప్రివిలేజ్‌గా లోక్‌సభ స్పీకర్‌ గుర్తించాలి. ఎంపీ విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును స్పీకర్‌ సుమోటోగా తీసుకొని విచారణకు ఆదేశించాలి. ఇందుకు కారకులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకొనే విశేష అధికారం పార్లమెంట్‌కు ఉంది’’ అని జనసేన రాజకీయ వ్యవహరాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.  

Advertisement