ఎవరు అడ్డుకున్నా ముందుకే వెళ్తాం: నాదెండ్ల మనోహర్

ABN , First Publish Date - 2021-09-30T21:57:13+05:30 IST

ఎవరు అడ్డుకున్నా ముందుకే వెళ్తామని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ అన్నారు. మీరు బాగు చేయరు.. తాము శ్రమదానం చేస్తామంటే..

ఎవరు అడ్డుకున్నా ముందుకే వెళ్తాం: నాదెండ్ల మనోహర్

అమరావతి: ఎవరు అడ్డుకున్నా ముందుకే వెళ్తామని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ అన్నారు.  మీరు బాగు చేయరు.. తాము శ్రమదానం చేస్తామంటే..అడ్డుకుంటామంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. కాటన్‌ బ్యారేజ్‌పై శ్రమదానం చేసి తీరుతామన్నారు. ఇప్పుడు హడావుడిగా పవన్ వెళ్లే ప్రాంతాలలో రోడ్లు వేస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై స్పందించమంటే...వ్యక్తిగత దూషణలు ఎందుకు? అని ప్రశ్నించారు. బద్వేల్ ఉపఎన్నిక అభ్యర్థిపై బీజేపీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Updated Date - 2021-09-30T21:57:13+05:30 IST