కర్నూలు: వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డిని ఓడించి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేసుకుద్దామని ఆ దిశగా ప్రతి జనసేనాని కృషి చేయాలని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళవారం మెగాసిరి ఫంక్షన్ హాలులో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో నాదెండ్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరును ప్రతిపాదించే వరకు జనసేన కృషి చేస్తుందన్నారు. ఆరు నియోజకవర్గాల్లో బలం జనసేన వైపే ఉందన్నారు. రేపు కర్నూలుకు రానున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జిల్లాకు ఏం చేయనున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజాయితీ నిరాడంబరత గల నాయకుడు దామోదరం సంజీవయ్యను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్దామని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి