రాజమండ్రి: మత్స్యకారులకు భరోసా కోసం జనసేన అభ్యున్నతి యాత్ర చేస్తోంది. ఇందులో భాగంగా రాజమండ్రి, రావులపాలెం మండలం ఈతకోటలో పర్యటిస్తున్న జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ జీవో 217 వల్ల మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారని, వెంటనే ప్రభుత్వం ఆ జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తీరప్రాంతాల్లో పర్యటించి మత్స్యకారుల సమస్యలు తెలుసుకుంటున్నామన్నారు. ఈనెల 20వ తేదీన సమగ్రమైన నివేదికను జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అందిస్తామన్నారు. నరసాపురంలో జరగబోయే బహిరంగ సభ ద్వారా మత్స్యకారులకు భరోసా కల్పిస్తామని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.