Abn logo
Aug 25 2021 @ 22:47PM

జనసేన బలోపేతానికి ఆమె ఎంతో కృషి‌ చేశారు: నాదెండ్ల మనోహర్

అమరావతి: జనసేన సీనియర్ నాయకురాలు బాడిత పద్మ కుటుంబాన్ని నాదెండ్ల మనోహర్, పోతిన మహేష్  పరామర్శించారు. ఇటీవల బాడిత పద్మ అనారోగ్యంతో మరణించారు. ఆమె చిత్రపటానికి అంజలి ఘటించి, కుటుంబ సభ్యులను మనోహర్ ఓదార్చారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ పార్టీలో విజయవాడతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో క్రియాశీలకంగా పద్మ పనిచేశారని చెప్పారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు నిబద్ధత గల మహిళగా గుర్తింపు సాధించారన్నారు. పార్టీ బలోపేతానికి ఆమె ఎంతో కృషి‌ చేశారని మనోహర్ పేర్కొన్నారు.