Abn logo
Jun 18 2021 @ 03:50AM

వింబుల్డన్‌, ఒలింపిక్స్‌కు నడాల్‌ దూరం

మాడ్రిడ్‌: ఇటీవల ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీ్‌సలో ఓటమిపాలైన స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రఫెల్‌ నడాల్‌ ఈనెలాఖరులో జరిగే వింబుల్డన్‌లో ఆడడం లేదని ప్రకటించాడు. అంతేకాదు.. వచ్చేనెలలో ప్రారంభం కానున్న ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు దూరమవుతున్నట్టు వెల్లడించాడు. రెండుసార్లు వింబుల్డన్‌ గెలిచిన నడాల్‌.. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో సింగిల్స్‌లో స్వర్ణం సాధించాడు.