నడాల్‌ దూకుడు

ABN , First Publish Date - 2022-01-20T06:40:20+05:30 IST

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సీడెడ్‌ క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. ఈసారి జొకోవిచ్‌ గైర్హాజరీలో టైటిల్‌ ఫేవరెట్‌గా భావిస్తున్న రఫెల్‌ నడాల్‌

నడాల్‌ దూకుడు

మూడో రౌండ్లో స్పెయిన్‌ బుల్‌

ఒసాక, బార్టీ, జ్వెరెవ్‌ ముందంజ


మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సీడెడ్‌ క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. ఈసారి జొకోవిచ్‌ గైర్హాజరీలో టైటిల్‌ ఫేవరెట్‌గా భావిస్తున్న రఫెల్‌ నడాల్‌, జ్వెరెవ్‌.. మహిళల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ నవోమి ఒసాక, నెంబర్‌వన్‌ ఆష్లే బార్టీ, వెటరన్‌ స్టార్‌ అజరెంకా మూడోరౌండ్‌కు దూసుకెళ్లారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండోరౌండ్లో ఆరోసీడ్‌ నడాల్‌ 6-2, 6-3, 6-4తో జర్మన్‌ క్వాలిఫయర్‌ యానిచ్‌ హాఫ్‌మన్‌పై గెలుపొందాడు. 21వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన నడాల్‌ ప్రీక్వార్టర్స్‌లో చోటు కోసం 28వ సీడ్‌ కచనోవ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఇతర స్టార్లలో జ్వెరెవ్‌ 6-4, 6-4, 6-0తో మిల్‌మన్‌పై, ఏడోసీడ్‌ బెర్రెటిని 6-1, 4-6, 6-4, 6-1తో కొజొలోవ్‌పై, 14వ సీడ్‌ షపొవలోవ్‌ 7-6(8-6), 6-7(3-7), 6-7(6-8), 7-5, 6-2తో క్వోన్‌ సూన్‌ వోపై, మోన్‌ఫిల్స్‌ 6-1, 6-0, 6-4తో బుబ్లిక్‌పై గెలిచి మూడోరౌండ్లోకి ప్రవేశించారు. 


ఒసాక సులువుగా..: మహిళల హాట్‌ ఫేవరెట్‌ ఒసాక వరుసగా రెండో విజయాన్ని సులువుగా అధిగమించింది. 13వ సీడ్‌ ఒసాక 6-0, 6-4తో మాడిసన్‌ బ్రెంగ్లెను ఓడించింది. ురో మ్యాచ్‌లో అమందా అనిసిమోవా6-2, 7-5తో ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత బెలిండా బెన్‌సిచ్‌ను చిత్తుచేసింది. ఆష్లే బార్టీ 6-1, 6-1తో లూసియా బ్రెంజొటిపై, 4వ సీడ్‌ క్రెజికోవా 6-2, 6-3తో వాంగ్‌పై, ఐదోసీడ్‌ మరియా సక్కారి 6-1, 6-4తో జెంగ్‌పై, 8వ సీడ్‌ బడోసా 6-0, 6-3తో  మార్టినా ట్రెవిసన్‌పై, మాజీ చాంపియన్‌ అజరెంకా 6-1, 6-2తో జిల్‌ తీచ్‌మన్‌పై గెలుపొంది మూడోరౌండ్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్నారు.


డుబుల్స్‌లో సానియా, బోపన్నకు నిరాశ: సానియా మీర్జా, రోహన్‌ బోపన్నకు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో నిరాశ ఎదురైంది. వీరిద్దరూ తమ భాగస్వాములతో కలిసి తొలిరౌండ్లోనే ఓడారు. మహిళల డబుల్స్‌లో సానియా-నదియా కిచెనోక్‌ జోడీ 4-6, 6-7(5)తో తమారా-జువాన్‌ చేతిలో ఓటమిపాలైంది. పురుషుల డబుల్స్‌లో బోపన్న-ఎడ్వర్డ్‌ ద్వయం 6-3, 6-7(2), 2-6తో క్రిస్టోఫర్‌-ట్రీట్‌ హూ జోడీ చేతిలో పరాజయం పాలైంది. 

Updated Date - 2022-01-20T06:40:20+05:30 IST