Abn logo
Mar 2 2021 @ 01:20AM

కేఎన్‌ఎం కళాశాలకు న్యాక్‌ గ్రేడ్‌

మిర్యాలగూడ టౌన్‌, మార్చి 1: పట్టణంలోని కేఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్‌ గ్రేడ్‌ లభించింది. నాణ్యమైన విద్యాసేవలు అందిస్తూ ఏటా ఉత్తమ ఫలితాలు సాధించడంతో పాటు టాస్క్‌, ఎన్‌ఎ్‌సఎ్‌స, ఎన్‌సీసీ విభాగాల్లో అగ్రగామిగా ఉన్న ఈ కళాశాల న్యాక్‌ గుర్తింపు సాధించింది. గత నెల 23, 24వ తేదీల్లో పర్యటించిన నేషనల్‌ ఎసె్‌సమెంట్‌ అండ్‌ అక్రిడేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) పీర్‌ టీం సమర్పించిన నివేదిక ఆధారంగా న్యాక్‌ సీ-గ్రేడ్‌ లభించింది. కళాశాలలో అందిస్తున్న విద్యా సేవలతో పాటు సామాజిక అంశాలు, పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన చర్యలను పరిశీలించడం ద్వారా ఈ గుర్తింపు లభించింది. జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందడం ద్వారా కళాశాలకు యూజీసీ, రూసా నిధులు సమకూరనున్నాయి. కళాశాల న్యాక్‌ గ్రేడ్‌ సాధించడం పట్ల ప్రిన్సిపాల్‌ షేక్‌ గాలీబ్‌, ఇంటర్నల్‌ క్వాలిటీ అసె్‌సమెంట్‌ సెల్‌ కోఆర్డినేటర్‌ వెంకటరమణ, ఎన్‌సీసీ అధికారులను ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మునిసిపల్‌ చైర్మన్‌ తిరునగరు భార్గవ్‌, పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు అభినందించారు.

Advertisement
Advertisement