Abn logo
Oct 19 2021 @ 22:59PM

భక్తిశ్రద్ధలతో మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలు

జిల్లా ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేస్తున్న వివిధ సంఘాల నాయకులు

- జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ 

- రోగులకు పండ్ల పంపిణీ

- మస్జిద్‌లో అన్నదానం


నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి):  మహ్మద్‌ ప్రవక్త జన్మదినాన్ని జిల్లా వ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రవక్త జన్మదినం సం దర్భంగా అన్ని మస్జీద్‌లలో సోమవారం రా త్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు జాగరణ నిర్వహించారు. ఈ సంద ర్భంగా ప్రత్యేక నమాజ్‌ కూడా చేశారు. మంగళవారం ఉదయం జిల్లా కేంద్రంలోని జామే మస్జీద్‌లో అన్నదానం చేశారు. అనం తరం జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ముస్లింల వివిధ కమిటీల ఆధ్వర్యంలో మధ్యాహ్నం పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వక్ఫ్‌ కాంప్లెక్స్‌పై జెండా ఎగురవేశారు. ఆయా చోట్ల జరిగిన కార్యక్రమాల్లో ముషావరత్‌ కమిటీ అధ్యక్షులు హబీబ్‌ఖాన్‌, ఉపాధ్యక్షు డు యాఖుబ్‌, కార్యదర్శి నాసర్‌, మహ్మద్‌ ఇబ్రహీం, హబీబ్‌ ఉర్‌రెహమాన్‌, ఉస్మాన్‌ ఖాన్‌, ఖలీల్‌నహదీ, ఇసాక్‌, మహ్మద్‌ ఆఫీజ్‌, కౌన్సిలర్‌ నిజాం, కాంగ్రెస్‌ నాయకులు సలీంలు పాల్గొన్నారు.