రూ.1,500 కోట్లతో గిడ్డంగులు, కోల్డ్‌స్టోరేజ్‌లు

ABN , First Publish Date - 2021-12-07T06:15:02+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకారపరపతి సంఘాల (పీఏసీఎస్‌)ల్లో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, నాణ్యతను మెరుగుపరచటానికి కోల్డ్‌స్టోరేజ్‌లను రూ.1,500కోట్లతో నిర్మిస్తున్నట్లు ఏపీ నాబార్డు సీజీఎం సుధీర్‌కుమార్‌ జిన్నావర్‌ తెలిపారు.

రూ.1,500 కోట్లతో గిడ్డంగులు, కోల్డ్‌స్టోరేజ్‌లు
జిల్లాలో పర్యటించిన నాబార్డు అధికారుల బృందం

నాబార్డు సీజీఎం సుధీర్‌ కుమార్‌ జిన్నావర్‌ 

గుంటూరు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకారపరపతి సంఘాల (పీఏసీఎస్‌)ల్లో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, నాణ్యతను మెరుగుపరచటానికి కోల్డ్‌స్టోరేజ్‌లను రూ.1,500కోట్లతో నిర్మిస్తున్నట్లు ఏపీ నాబార్డు సీజీఎం సుధీర్‌కుమార్‌ జిన్నావర్‌ తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటానికి వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, పరిశ్రమలను నాబార్డు ప్రో త్సహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో సోమవారం నాబార్డు ఉన్నతాధికారుల బృందం పర్యటించింది. ఈసందర్భంగా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో వివిధ అంశాలను చర్చించారు.  ఈ సందర్భంగా సుధీర్‌కుమార్‌ జిన్నావర్‌ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.30కోట్లతో నాబార్డు 324 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఈ సంఘాల ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించటానికి నాణ్యమైన విత్తనాలు, మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో జీఎంలు రమే ష్‌బాబు, నగేష్‌కుమార్‌, ఏజీఎంలు కార్తీక్‌ (గుంటూరు), తురుమెళ్ళ విజయ్‌ (కృష్ణా) తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-07T06:15:02+05:30 IST