Abn logo
Sep 30 2020 @ 17:02PM

`బ్లాక్‌రోజ్` సాంగ్ వచ్చేసింది!

Kaakateeya

బాలీవుడ్ హాట్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలా `బ్లాక్‌రోజ్` చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. తన గ్లామర్‌ను దక్షిణాదికీ పరిచయం చేయబోతోంది. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది కథ అందిస్తున్న ఈ చిత్రానికి మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

 

నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తమ సొంత బ్యానర్‌పై పవన్ కుమార్ సమర్పణలో నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. మణిశర్మ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ బయటకు వచ్చింది. `నా తప్పు ఏముందబ్బా` అంటూ సాగే ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ విడుదల చేశాడు. Advertisement
Advertisement
Advertisement