మంత్రి కొడాలి నాని ఒక మానసిక రోగి

ABN , First Publish Date - 2020-12-03T04:43:37+05:30 IST

మంత్రి కొడాలి నాని ఒక మానసిక రోగి అని, తన మంత్రి పదవి ని కాపాడుకోవడానికి చంద్రబాబుపై అవాకులు, చవాకులు పేలుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాష మండిపడ్డారు.

మంత్రి కొడాలి నాని ఒక మానసిక రోగి
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల

 టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాష

రాయచోటిటౌన్‌, డిసెంబరు2: మంత్రి కొడాలి నాని ఒక మానసిక రోగి అని, తన మంత్రి పదవి ని కాపాడుకోవడానికి చంద్రబాబుపై అవాకులు, చవాకులు పేలుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాష మండిపడ్డారు. బుధవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ కొడాలి నానికి రాజకీయ జన్మనిచ్చిన చంద్రబాబునాయుడును స్థాయి మరిచి మాట్లాడడం తగదన్నారు.  చంద్రబాబును ఇష్టానుసారంగా మాట్లాడితే నీ నాలుక కోస్తామని హెచ్చరించారు. కొడాలినాని ఒక అసమర్థ మంత్రి అని అధికారులకు ఏ నాడూ సమీక్ష, సమావేశాలు కూడా పెట్టలేదని ఆయన ఆరోపించారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబునాయుడును తిట్టి మంత్రి పదవిని కాపాడుకోవడం కోసం దిగజారి మాట్లాడుతున్నారన్నారు. నివర్‌ తుఫాన్‌ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చంద్రబాబునాయుడు అసెంబ్లీలో ప్రశ్నిస్తే టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేయడం దారుణమన్నారు.  రాయచోటి ప్రజలు, రైతులు నివర్‌ తుఫాన్‌ వచ్చి ఇబ్బందులు పడుతుంటే  స్థానిక ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఏ రోజూ ఇక్కడ పర్యటించలేదన్నారు. తన సొంత లాభం కోసం హైదరాబాదు, విజయవాడకు తిరుగుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఖాదర్‌వలి, రాష్ట్ర మైనార్టీ సెల్‌ కార్యదర్శి అబూసర్‌, టీడీపీ సీనియర్‌ నాయకులు కొట్టే చలపతి, 7వ వార్డు అధ్యక్షుడు అతావుల్లా, 11వ వార్డు అధ్యక్షుడు సోనీరాజ్‌ కలీం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-03T04:43:37+05:30 IST