కొత్తదనానికి నాంది

ABN , First Publish Date - 2021-02-26T06:10:41+05:30 IST

నాంది చిత్రం విజయోత్సవ యాత్రలో భా గంగా రాజమహేంద్రవరం వచ్చిన హీరో అల్లరి నరేష్‌, నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా ముచ్చటించారు.

కొత్తదనానికి నాంది
హీరో అల్లరి నరేష్‌, నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌

  • హీరో అల్లరి నరేష్‌, నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌లతో ముఖాముఖి

గోదావరి సిటీ: నాంది చిత్రం విజయోత్సవ యాత్రలో భా గంగా రాజమహేంద్రవరం వచ్చిన హీరో అల్లరి నరేష్‌, నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా ముచ్చటించారు. 

ప్రశ్న: నాంది విజయం మీకు ఎలా అనిపించింది?

నరేష్‌: ఈ చిత్రం సూపర్‌హిట్‌ కావడం నాకు చాలా ఆనందం గా ఉంది. అల్లరి నరేష్‌ కనిపించకుండా సూర్యప్రకాష్‌ మాత్రమే కనిపించడం నా సినీ కెరియర్‌లోనే కొత్తదనానికి నాంది.

ప్రశ్న: మీకు సినీ పరిశ్రమలో ప్రేరణ ఎవరు?

నరేష్‌: నాన్నగారితోపాటు అన్నయ్యకు, నాకు కూడా ప్రేరణ మూవీ మొఘల్‌ డి.రామానాయుడుగారు.

ప్రశ్న: కథల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?

నరేష్‌: మొన్నటివరకు ఒక భయం ఉండేది. నేనుసీరియస్‌ క్యా రెక్టర్‌ చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా? అని.. ఇప్పుడు ఆ భయం పో యింది. ఇక్కడినుంచి కొత్తకథలు వస్తాయి. 

ప్రశ్న: జిల్లాతో మీకు ఉన్న అనుబంధం?

నరేష్‌: గోదారే అడ్డుకదా! పక్కనున్న పశ్చిమగోదావరిజిల్లా దొమ్మేరు మా స్వగ్రామం. ఇక్కడ ఎన్నో సినిమాలు తీశాం. గోదారి జిల్లాలంటే మర్యాద, వెటకారం ముందుగా గుర్తుకొస్తాయి.

ప్రశ్న: సెక్షన్‌ టు లెవెన్‌ గురించి ముందుగా చర్చించారా?

నరేష్‌: దీనిగురించి ఎవరికీ తెలియదు. దేశంలో 2,50,000పైగా కేసుల్లో తప్పు చేశారో లేదో తెలియకుండానే జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఒక ఆర్టికల్‌లో చదివాను. 21ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన ఒక వ్యక్తిని అప్పుడు నిర్దోషిగా తేల్చి విడుదల చేశారు.

ప్రశ్న: సినీ జీవితంలో మీకు ప్రేరణ ఎవరు?

వరలక్ష్మి: నాన్న శరత్‌కుమార్‌గారు నాకు ప్రేరణ. ఆయన నేర్పిన క్రమశిక్షణే నన్ను ఈస్థాయికి తీసుకొచ్చింది.

ప్రశ్న: మీ తరువాత చిత్రం ఏమిటి?

వరలక్ష్మి: సందీప్‌ కిషన్‌తో ఒక చిత్రం చేస్తున్నాను.

ప్రశ్న: పాత్రల విషయంలో ఏమేం జాగ్రత్తలు తీసుకుంటారు?

వరలక్ష్మి:  కథాంశం బాగుంటే గెస్ట్‌ యాక్టర్‌గానైనా చేస్తాను. కొత్తదనాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు.

Updated Date - 2021-02-26T06:10:41+05:30 IST