మార్కెట్లో N95 మాస్కును కొన్నారా..? అది అసలుదో.. నకిలీదో తెలుసుకోండిలా..!

ABN , First Publish Date - 2022-01-15T14:25:27+05:30 IST

కరోనా నుంచి కాపాడుకునేందుకు మాస్క్..

మార్కెట్లో N95 మాస్కును కొన్నారా..? అది అసలుదో.. నకిలీదో తెలుసుకోండిలా..!

కరోనా నుంచి కాపాడుకునేందుకు మాస్క్ తప్పనిసరి. వైరస్ మీ శరీరంలోకి చేరకుండా మాస్క్ కాపాడుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో పలు రకాల మాస్క్‌లు లభ్యమవుతున్నాయి. అయితే వైద్య నిఫుణులు ఎన్95 మాస్క్‌ ధరించడం ఉత్తమమని సలహా ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో పలు దుకాణాలలో, ఈ- కామర్స్ వెబ్‌సైట్‌లలో ఎన్ 95 మాస్క్‌ల విక్రయం జోరుగా జరుగుతోంది. ఈ సందడిలో మార్కెట్‌లో నకిలీ ఎస్95 మాస్కులు కూడా ప్రవేశించాయి. దీంతో వినియోగదారులు ఒరిజినల్ ఎన్ 95 మాస్క్ ఏదో.. నకిలీ ఎన్95 మాస్క్ ఏదో తెలుసుకోలేకపోతున్నారు. వైద్య నిపుణులు.. ఒరిజినల్ ఎన్ 95 మాస్క్‌ను ఎలా గుర్తించవచ్చో తెలిపారు. ఆ వివరాలు మీకోసం.. మార్కెట్‌లో లభ్యమయ్యే మిగిలిన మాస్క్‌ల కన్నా ఎన్95 మాస్క్ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మాస్క్ ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ ఎడ్మినిస్ట్రేషన్ తెలిపిన వివరాల ప్రకారం ఎన్95 మాస్క్.. ఎటువంటి ఎయిర్బోర్న్ పార్టికల్స్‌ను శరీరంలోకి వెళ్లకుండా  చూస్తుంది. ఇన్ఫెక్షన్ ముప్పును చాలావరకూ తగ్గిస్తుంది. ఎన్ 95 మాస్క్ కరోనా వైరస్ నుంచి సమర్థవంతంగా కాపాడగలిగే మాస్క్‌గా గుర్తింపు పొందింది. ఈ మాస్క్ నోటిని, ముక్కును అత్యంత చక్కగా కప్పివుంచుతుంది. గాలిలోని 95 శాతం కణాలను శరీరంలోకి ప్రవేశించకుండా చూస్తుంది. 


కరోనా వైరస్ కణాలు 0.12 మైక్రానులుగా ఉంటాయి. ఎన్ 95 మాస్క్ 0.1 నుంచి 0.3 మైక్రాన్ కణాలను శరీరంలోనికి ప్రవేశించకుండా చూస్తుంది. ఎన్95 మాస్క్ 4 రకాలుగా ఉంటుంది. మొదటిది రెగ్యులర్ ఎన్95 మాస్క్.. దీనిని రెగ్యులర్ యూజ్ కోసం వినియోగించవచ్చు. అయితే ఇది ఒకసారి మురికిగా తయారైతే.. మరోమారు వినియోగించకూడదు. ఇక రెండవది వాషబుల్ ఎన్95 మాస్క్.. దీనిని వినియోగించాక వాష్ చేసుకుని తిరిగి వాడుకోవచ్చు. ఇదేవిధంగా మూడవ ఎన్ 95 మాస్క్.. పిల్లల కోసం రూపొందించారు. అయితే దీనిని వాష్ చేయకూడదు. మురికిగా తయారయ్యక దానిని తిరిగి వినియోగించకూడదు. ఇక నాలుగవ ఎన్95 మాస్క్ పిల్లల కోసం తయారు చేసినది. ఇది వాషబుల్. దీనిని వాష్ చేసుకుని తిరిగి వినియోగించుకోవచ్చు. ఇక వీటి ధరల విషయానికొస్తే రెగ్యులర్ ఎన్ 95 మాస్క్ ధర రూ. 200 నుంచి రూ. 300 మధ్య ఉంటుంది. వాషబుల్ ఎన్ 95 మాస్క్ ధర రూ.250 నుంచి రూ. 450 మధ్య ఉంటుంది. ఇక పిల్లల ఎన్95 మాస్క్ ధర రూ. 150 నుంచి రూ.250 మధ్య ఉంటుంది. అలాగే పిల్లల వాషబుల్ ఎన్95 మాస్క్ ధర రూ. 200 నుంచి రూ. 300 మధ్య ఉంటుంది. ఇక నకిలీ ఎన్95 మాస్క్‌ను ఎలా గుర్తు పట్టవచ్చంటే.. దానిపై ఎటువంటి సర్టిఫైడ్ కంపెనీ లోగో ఉండదు. అలాగే NIOSH (National Institute for Occupational Safety and Health ) స్పెల్లింగ్ తప్పుగా ఉంటుంది. రంగురంగుల హెడ్ బ్యాండ్ ఉంటుంది. ఇక ఒరిజినల్ ఎన్ 95 మాస్క్‌ను ఎలా గుర్తుపట్టవవచ్చంటే.. బ్రాండ్ పేరు CDC ఇండెక్స్‌ను చెక్ చేయవచ్చు. NIOSH అప్రూవల్ చేసిందో లేదో కూడా గమనించవచ్చు. బ్రాండ్ మాన్యుఫాక్చరర్, ట్రేడ్ మార్క్ మొదలైనవి మాస్క్‌పై ప్రింటైవుంటాయి.  ఆన్‌లైన్‌లో ఎన్95 మాస్క్ కొనుగోలు చేసేముందు రివ్యూలను తప్పనిసరిగా చదవండి. 

Updated Date - 2022-01-15T14:25:27+05:30 IST