హెల్మెట్లు ఆ సామర్థ్యాన్ని దెబ్బ తీస్తాయా?

ABN , First Publish Date - 2020-05-26T20:32:17+05:30 IST

యుద్ధానికి వెళ్లే సైనికులకు రక్షణ పరికరాలు ఎంత అవసరమో ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ అంత అవసరం. అందుకే ట్రాఫిక్ నిబంధనల్లో హెల్మెట్ వాడకాన్ని ప్రభుత్వాలు తప్పని సరి చేశాయి.

హెల్మెట్లు ఆ సామర్థ్యాన్ని దెబ్బ తీస్తాయా?

ఇంటర్నెట్ డెస్క్: యుద్ధానికి వెళ్లే సైనికులకు రక్షణ పరికరాలు ఎంత అవసరమో ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ అంత అవసరం. అందుకే ట్రాఫిక్ నిబంధనల్లో హెల్మెట్ వాడకాన్ని ప్రభుత్వాలు తప్పని సరి చేశాయి. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడిపితే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తున్నారు. 


అయితే హెల్మెట్ల వాడకంపై వాహనదారుల్లో కొన్ని అపోహలు నెలకొన్నాయి. హెల్మెట్ వాడితే అలా అవుతుంది.. ఇలా జరుగుతుంది అంటూ కొందరు లేనిపోని అపోహలను పుట్టిస్తున్నారు. ఇలాంటి అపోహలపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. హెల్మట్ల వాడకంలో ఏది అపోహ? ఏది వాస్తవం? అనే విషయాలను తెలియజేశారు.


అపోహలు వర్సెస్ వాస్తవాలు


అపోహ: హెల్మెట్ ధరించడం వల్ల మెడ నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి.

వాస్తవం: నిబంధనలకు అనుగుణంగా ఉండే హెల్మెట్లు సరిగ్గా ధరించడం వల్ల అలాంటి ఇబ్బంది ఉండదు.


అపోహ: హెల్మెట్లు వినికిడి శక్తిని, ధ్వనిని బలహీన పరుస్తాయి

వాస్తవం: హెల్మెట్లు శబ్దాన్ని తగ్గించవచ్చు కానీ, శబ్దాల మధ్య తేడాను గుర్తించే రైడర్ సామర్థ్యాన్ని ప్రభావితం చేయవు.


అపోహ: హెల్మెట్ లేకపోవడం కంటే ఏదో ఒక హెల్మెట్ పెట్టుకోవడం మంచిదే

వాస్తవం: యాక్సిడెంట్ విషయంలో తక్కువ నాణ్యత గల హెల్మెట్ ఉపయోగించే రైడర్ మరింత తీవ్రంగా గాయపడవచ్చు లేదా చనిపోవచ్చు.  



Updated Date - 2020-05-26T20:32:17+05:30 IST