Apr 19 2021 @ 14:10PM

అఖిల్‌తో క్రేజీ డైరెక్టర్‌ను లైన్‌లో పెట్టిన మైత్రీ..!

స్టార్‌ హీరోలు, డైరెక్టర్స్‌తో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను రూపొందిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు అఖిల్‌ అక్కినేని హీరోగా 'ఆర్‌.ఎక్స్‌ 100' ఫేమ్ అజయ్‌ భూపతి దర్శకత్వంలో ఓ సినిమాను రూపొందించేలా మైత్రీ మూవీ మేకర్స్‌ చర్చలు జరుపుతోంది. అందులో భాగంగా ఇప్పటికే అజయ్‌ భూపతి, అఖిల్‌ను కలిసి స్టోరీ లైన్‌ను వినిపించాడట. అఖిల్‌కు కూడా స్టోరీలైన్‌ బాగా నచ్చిందని టాక్‌. ప్రస్తుతం సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా 'ఏజెంట్‌' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు డైరెక్టర్‌ అజయ్‌ భూపతి .. శర్వానంద్‌, సిద్ధార్థ్‌లతో కలిసి 'మహా సముద్రం' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. వీరిద్దరూ ఇప్పుడున్న కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేసుకోగానే అఖిల్‌, అజయ్ భూపతి కాంబోలో సినిమా ట్రాక్‌ ఎక్కుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.