అత్తారింట్లో కనీసం గౌరవం లేదంటూ కోపం.. అందరిలోనూ అవమానించాడని బామ్మర్దిపై పగ.. చివరకు ఎంతకు తెగించాడంటే..

ABN , First Publish Date - 2022-09-02T23:29:26+05:30 IST

ఆ వ్యక్తి కొన్నేళ్ల కిందట కులాంతర వివాహం చేసుకున్నాడు.. దీంతో అత్తింటి వారు అతడిని పట్టించుకునే వారు కాదు..

అత్తారింట్లో కనీసం గౌరవం లేదంటూ కోపం.. అందరిలోనూ అవమానించాడని బామ్మర్దిపై పగ.. చివరకు ఎంతకు తెగించాడంటే..

ఆ వ్యక్తి కొన్నేళ్ల కిందట కులాంతర వివాహం చేసుకున్నాడు.. దీంతో అత్తింటి వారు అతడిని పట్టించుకునే వారు కాదు.. ముఖ్యంగా బావమరిది అతడిని తరచుగా అవమానించేవాడు.. ఇటీవల ఓ పెళ్లిలో దొంగ అనే ముద్ర వేశాడు.. దీంతో అతను రగిలిపోయాడు.. బావమరిదిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు.. గత నెల 29న నేరుగా బావమరిది ఇంటికి వెళ్లాడు.. ఇంట్లో బావమరిది లేకపోవడంతో అతని భార్యను, ఐదేళ్ల కొడుకును చంపేశాడు.. అనంతరం ఆ ఇంట్లో డబ్బు, నగలు పట్టుకుని పారిపోయాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. 


ఇది కూడా చదవండి..

Meerut: బ్యాంకు మేనేజర్ భార్య, కొడుకు హత్య కేసులో కొత్త ట్విస్ట్.. సన్నిహితుల పనేనని పోలీసుల అనుమానం..


మీరట్‌ (Meerut)లో నివసిస్తున్న బ్యాంక్ మేనేజర్ సందీప్ కుమార్ భార్య, ఐదేళ్ల కుమారుడి హత్యల వెనుక ఉన్న మిస్టరీ వీడింది. సందీప్ బావమరిది హరీష్ కుమార్ స్వయంగా ఈ హత్యలు చేసినట్టు స్పష్టమైంది. తన సోదరిని కులాంతర వివాహం చేసుకున్నాననే కారణతో సందీప్ తనను తరచుగా అవమానించే వాడని, ఇటీవల ఓ పెళ్లిలో తనపై దొంగ అనే ముద్ర వేశాడని, ఆ పగతోనే అతని భార్యను, కొడుకును చంపానని హరీష్ అంగీకరించాడు. అనంతరం పోలీసుల దృష్టి మరల్చేందుకు చోరీ జరిగినట్టు ప్లాన్ చేశానని చెప్పాడు. 


ఇంట్లో పరిస్థితిని చూసిన పోలీసులు చోరీకి వచ్చిన దొంగలు ఆ హత్యలు చేసి ఉంటారని మొదట భావించారు. అయితే విచారణ సాగుతున్న కొద్దీ ఆ హత్యలు దొంగలు చేసినవి కావని, బంధువులే పథకం ప్రకారం హత్యలు చేసి ఉంటారని అనుమానించారు. సందీప్.. హరీష్‌పై అనుమానం వ్యక్తం చేయడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో హరీష్ తన నేరాన్ని అంగీకరించాడు. 

Updated Date - 2022-09-02T23:29:26+05:30 IST