ఈ గొయ్యి మిస్టరీ వీడేదెప్పుడో..? లోపలి నుంచి దుర్వాసన.. అంతుబట్టని రహస్యం..!

ABN , First Publish Date - 2021-06-25T02:04:51+05:30 IST

యెమెన్ తూర్పు ప్రాంతంలోని అల్-మహ్రా ప్రావిన్స్ ఎడారిలో ఉన్న ది `వెల్ ఆఫ్ బార్హౌట్`కు సంబంధించిన మిస్టరీ ఇప్పటికీ వీడలేదు.

ఈ గొయ్యి మిస్టరీ వీడేదెప్పుడో..? లోపలి నుంచి దుర్వాసన.. అంతుబట్టని రహస్యం..!

యెమెన్ తూర్పు ప్రాంతంలోని అల్-మహ్రా ప్రావిన్స్ ఎడారిలో ఉన్న ది `వెల్ ఆఫ్ బార్హౌట్`కు సంబంధించిన మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. దీనిని `వెల్ ఆఫ్ హెల్` అని కూడా స్థానికులు పిలుస్తారు. స్థానిక జానపద కథల ప్రకారం దీనిని `రాక్షసుల జైలు`గా భావిస్తారు. ఈ భారీ రంధ్రం గురించి ఆధునిక శాస్త్రవేత్తలు కూడా పూర్తిగా చెప్పలేకపోతున్నారు. 


యెమెన్ తూర్పు సరిహద్దు ప్రాంతంలోని అల్-మహ్రా ఎడారిలో ఉన్న ఈ 30 మీటర్ల వెడల్పు కలిగిన గొయ్యి 100 నుంచి 250 మీటర్ల లోతు వరకు ఉంటుందని పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దాని లోపల ఏముందో తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఇప్పటివరకు ఫలించలేదు. ఆ గొయ్యిలో చాలా కొద్ది స్థాయిలో మాత్రమే ఆక్సిజన్ ఉందని, వెంటిలేషన్ అసలు లేదని, అంతకు మించి ఏమీ చెప్పలేమని జియోలాజికల్ సర్వే అధికారి చెప్పారు. 


`మేం ఆ ప్రాంతానికి వెళ్లి గొయ్యి లోపలికి దిగేందుకు ప్రయత్నించాం. 50-60 అడుగుల లోతుకు వెళ్లిన తర్వాత లోపల ఏవో వింత విషయాలు ఉన్నట్టు గుర్తించాం. అలాగే లోపలి నుంచి వింత వాసన రావడం గమనించాం. అది ప్రస్తుతానికి మిస్టరీనే. ఆ రంధ్రం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉంటుంది. దాని గురించి ఇంకా పూర్తి స్థాయిలో పరిశోధన జరగాల`ని చెప్పారు. జిన్స్ లేదా జీనియస్ అని పిలిచే అతీంద్రీయ శక్తులు శతాబ్దాలుగా లోపల ఉన్నాయని కొందరు నమ్ముతున్నారు. 

Updated Date - 2021-06-25T02:04:51+05:30 IST