Gujarat:ఆకాశం నుంచి లోహపు బంతుల వాన.. బెంబేలెత్తిన ప్రజలు

ABN , First Publish Date - 2022-05-17T02:04:17+05:30 IST

గుజరాత్‌లోని కొన్ని గ్రామాల్లో ఆకాశం నుంచి కిందపడిన వింత వస్తువులు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి

Gujarat:ఆకాశం నుంచి లోహపు బంతుల వాన.. బెంబేలెత్తిన ప్రజలు

గాంధీనగర్: గుజరాత్‌లోని కొన్ని గ్రామాల్లో ఆకాశం నుంచి కిందపడిన వింత వస్తువులు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. తలలపై పడడంతో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. సురేంద్రనగర్ జిల్లాలోని సేలా గ్రామంలో బంతి ఆకారంలో ఉన్న లోహపు వస్తవులు చెల్లాచెదురుగా పడ్డాయి. అవి తమను భయభ్రాంతులకు గురిచేశాయని స్థానికులు చెబుతున్నారు.


ఖేడా జిల్లాలోని ఉమ్రేత్, నదియాద్ జిల్లాలో మూడు రోజులుగా ఆకాశం నుంచి నలుపు, సిల్వర్ మెటల్ బాల్స్ కిందపడుతున్నాయి.  అలాగే, ఆనంద్ జిల్లాలోని మరో మూడు గ్రామాల్లోనూ ఇలాగే లోహపు బంతులు కిందపడుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఫిజికల్ రీసెర్చ్ లేబరేటర్ (PRL) ఆ మెటల్ బాల్స్‌ను సేకరించింది. అవి ఉపగ్రహ వ్యర్థాలని తేల్చింది.  

Updated Date - 2022-05-17T02:04:17+05:30 IST