అది రక్తం తాగే వింత జీవా..? సీసీకెమెరాకు చిక్కిన షాకింగ్ దృశ్యం.. తోడేలు లాంటి ముఖం.. రెండు కాళ్లతో నడుస్తూ

ABN , First Publish Date - 2022-06-12T02:53:46+05:30 IST

టెక్సాస్ రాష్ట్రంలోని(అమెరికా) అమరిల్లో నగరంలో ఓ వింత జీవికి సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

అది రక్తం తాగే వింత జీవా..? సీసీకెమెరాకు చిక్కిన షాకింగ్ దృశ్యం.. తోడేలు లాంటి ముఖం.. రెండు కాళ్లతో నడుస్తూ

ఎన్నారై డెస్క్: టెక్సాస్ రాష్ట్రంలోని(అమెరికా) అమరిల్లో నగరంలో ఓ వింత జీవికి  సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతున్నాయి. స్థానికంగా ఉన్న ఓ జూ సమీపంలో ఆ వింత జీవి  కెమెరాకు చిక్కింది. ఇదేంటో అర్థం కాక ప్రస్తుతం జూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అది జంతువు వేషం వేసుకున్న మనిషి చిత్రమా లేక.. చుపకాబ్రా అనే రక్తం పీల్చే జంతువా అంటూ ప్రజలు కథలు కథలుగా చర్చించుకుంటున్నారు. తోడేలు లాంటి ముఖంతో రెండు కాళ్లతో నడుస్తున్నట్టు కనిపించింది. అమెరికా జనాపద కథల ప్రకారం.. రాత్రి సమయంలో చుపకాబ్రా జనావాసల మధ్యకు వచ్చి గొర్రెలు, మేకలు, ఆవుల రక్తం తాగిపోతుంటుంది. అది తోడేలు లాంటి ముఖంతో ఉండే ఆ జీవి చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. కాగా.. అమరిల్లో నగర అధికారులు ఆ చిత్రాన్ని సోషల్  మీడియాలో షేర్ చేశారు. ఇది జంతువుల కాస్టూమ్ వేసుకున్న మనిషా లేక నిజంగానే చుకాబ్రా వచ్చిందా అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ఫేస్ బుక్ పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది. మరీ మీరు దీనిపై ఓ లుక్కేయండి..!



Updated Date - 2022-06-12T02:53:46+05:30 IST