Abn logo
Sep 19 2021 @ 12:59PM

మైసూరు ఫాంహౌస్‌లో బాలికపై అత్యాచారం

బెంగళూరు: రాచనగరి మైసూరులో అత్యాచారాల పర్వం కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ కన్నడ సినీనటుడికి చెందిన ఫాంహౌస్‌లో పదేళ్ల బాలికపై అత్యాచారం జరిగినట్టు శనివారం వెలుగుచూసింది. ఈ నెల 16న ఘటన చోటు చేసుకున్నట్టు ఫాం హౌ్‌సలో పనిచేసే శివమొగ్గ జిల్లాకు చెందిన కార్మికుడు దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు వెల్లడించారు. టీ నరసీపుర తాలూకా కెంపయ్యనహుండిలోని ఈ ఫాంహౌస్‌లో శివమొగ్గకు చెందిన దంపతులు కూలీలుగా పనిచేస్తున్నారు. వీరితోపాటు ఉంటున్న పదేళ్ల కుమార్తెపై అక్కడ పనిచేస్తున్న నిజాం అనే యువకుడు ఈనెల 16న అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. అనంతరం పలుమార్లు బెదిరించి బాలికపై ఇతను అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు ఈ దారుణాన్ని గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైసూరు మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఈమేరకు కేసు దాఖలైంది. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి పంపామని జిల్లా ఎస్పీ ఆర్‌ చేతన్‌ వెల్లడించారు. కాగా మూడేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన 74 ఏళ్ల వృద్ధుడిని అరెస్టు చేసిన ఘటన ఉత్తరకన్నడ జిల్లా దాండేలిలో జరిగింది. అఫ్జల్‌ ఉస్మాన్‌ సయ్యద్‌ (74), బాలికకు చాకొలెట్‌ ఆశచూపి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు వెలుగుచూసింది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇతడిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. 


క్రైమ్ మరిన్ని...