అంబురాన్నంటిన మైసమ్మ బోనాలు

ABN , First Publish Date - 2022-08-12T05:02:15+05:30 IST

గండి మైసమ్మ తల్లో... మమ్ము చల్లంగా చూడంటూ....

అంబురాన్నంటిన మైసమ్మ బోనాలు
మైసిగండిలో బోనాల ర్యాలీ

కడ్తాల్‌, ఆగస్టు 11: గండి మైసమ్మ తల్లో... మమ్ము చల్లంగా చూడంటూ.... మైసిగండిలో భక్తులు మైసమ్మ దేవతను వేడుకున్నారు. బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఏడాదికోసారి జరుపుకునే బోనాల వేడుకను గురువారం కడ్తాల మండలం మైసిగండి గ్రామంలో అంబురాన్నంటింది. మైసమ్మ బోనాల పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. బోనాల వేడుక నేపథ్యంలో మైసిగండి మైసమ్మ ఆలయాన్ని పచ్చటి తోరణాలు, పుష్పాలతో శోభయమానంగా అలంకరించారు. మహిళలు పట్టు వస్త్రాలు ధరించి బోనం కుండలను అలంకరించుకొని ర్యాలీగా మైసమ్మ దేవాలయానికి చేరుకున్నారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బోనాల వేడుక ర్యాలీలో మహిళల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, యువతీయువకుల నృత్యాలు, కేరింతలు, బ్యాండ్‌ వాయిద్యాలు, డప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, పీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌, సర్పంచ్‌ రామావత్‌ తులసీరామ్‌నాయక్‌, ఎంపీపీ దేపావత్‌ కమ్లిమోత్యనాయక్‌, గౌడ సంఘం నాయకులు శేషయ్యగౌడ్‌, పుల్లయ్యగౌడ్‌, వెంకటేశ్‌గౌడ్‌, యాదగిరిగౌడ్‌, బాలయ్యగౌడ్‌, సురేశ్‌గౌడ్‌, నర్సింహగౌడ్‌, రాజుగౌడ్‌, మాదారం గణేశ్‌గౌడ్‌, శ్రీరాములు, యాదయ్యగౌడ్‌, మల్లేశ్‌గౌడ్‌, ప్రవీణ్‌గౌడ్‌, నారాయణ, అయిళ్ల లక్ష్మమ్మ, మహేశ్‌గౌడ్‌, పల్లేశ్‌గౌడ్‌, సుగంద్‌, మాదారం వసంత, యాదమ్మ పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-12T05:02:15+05:30 IST