లిటిల్‌ చెఫ్‌

ABN , First Publish Date - 2020-06-03T05:30:00+05:30 IST

లాక్‌డౌన్‌ సమయంలో ఇంటిపట్టున పిల్లలు టీవీ చూస్తూ, స్మార్ట్‌ ఫోన్‌లో ఆటలు ఆడుతూ గడిపేస్తుంటే ఈ చిన్నారి మాత్రం వంటకాలతో అదరగొడుతోంది. అంతేకాదు ఆన్‌లైన్‌లో తను చేసిన వంటకాలను అమ్ముతూ డబ్బు కూడా సంపాదిస్తోంది...

లిటిల్‌ చెఫ్‌

లాక్‌డౌన్‌ సమయంలో ఇంటిపట్టున పిల్లలు టీవీ చూస్తూ, స్మార్ట్‌ ఫోన్‌లో ఆటలు ఆడుతూ గడిపేస్తుంటే ఈ చిన్నారి మాత్రం వంటకాలతో అదరగొడుతోంది. అంతేకాదు ఆన్‌లైన్‌లో తను చేసిన వంటకాలను అమ్ముతూ డబ్బు కూడా సంపాదిస్తోంది. మయన్మార్‌కు చెందిన ఎనిమిదేళ్ల మో మింట్‌ మే ఇప్పుడు అక్కడ పాపులర్‌ చెఫ్‌గా గుర్తింపు సాధించింది. ఏ వంటకం ఎలా వండాలో తన చిట్టిపొట్టి మాటలతో వివరిస్తుంది. మే వంట చేస్తున్న వీడియోను వాళ్ల అమ్మ ఏప్రిల్‌లో ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేసింది. 


మయన్మార్‌ ప్రజలు ఎంతో ఇష్టపడే బ్రేక్‌ఫాస్ట్‌ ‘మోహింగ్యా’ తయారీని వివరిస్తున్న వీడియో తనను స్టార్‌ను చేసింది. ఆ వీడియోను 2 లక్షల మందికి పైగా చూశారు. ఇప్పటి వరకూ 15 రకాల వంటకాలను వండడం నేర్చుకున్న మోను అంతా ‘లిటిల్‌ చెఫ్‌’ అని పిలుస్తున్నారు. ‘‘నాకు వంట చేయడమంటే చాలా ఇష్టం. పెద్దయ్యాక కుకింగ్‌నే కెరీర్‌గా ఎంచుకోవాలనుకుంటున్నా. అమ్మతో కలిసి నేనూ గరిటె తిప్పడం చాలా సంతోషంగా ఉంది’’ అని నవ్వుతూ చెబుతుందీ మో.


Updated Date - 2020-06-03T05:30:00+05:30 IST