నా గది..

ABN , First Publish Date - 2020-06-22T07:57:35+05:30 IST

ఓ విశాల లోకం... కనుచూపు మేర పరచుకుంటాను! నా గది ఇరుకైన అగ్నిగోళం... పొరలుగా రగిలి విరుచుకుంటాను!...

నా గది..

ఓ విశాల లోకం... 

కనుచూపు మేర 

పరచుకుంటాను! 


నా గది 

ఇరుకైన అగ్నిగోళం...

పొరలుగా రగిలి

విరుచుకుంటాను! 


నా గది 

విరిగిన ఓడ జాడ... 

చుట్టూ చెలిమె తొలుస్తాను! 


నా గది 

ఏరులేని తడి నీడ....

లోతుల్లో తెప్ప వేస్తాను! 


నా గది 

పగిలిన గవ్వ...

నాదమై ప్రవహిస్తాను! 


నా గది 

కుదురులేని అల...

దాహాన్నై పరితపిస్తాను ! 


నా గది 

చిగురేసే చీకటిగుహ...

చెలిమై నడుస్తాను! 


నా గది 

నడుం వాల్చిన వెన్నెల...

ఒడిలో తడుస్తాను! 

సత్యా బిరుదరాజు


Updated Date - 2020-06-22T07:57:35+05:30 IST