బీజేపీ నా ఫోన్ ట్యాప్ చేస్తోంది.. సీఐడీ విచారణకు ఆదేశిస్తా: మమత

ABN , First Publish Date - 2021-04-17T21:39:09+05:30 IST

తన ఫోన్ ట్యాపింగ్‌కు గురవుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. దీనిపై తాను ...

బీజేపీ నా ఫోన్ ట్యాప్ చేస్తోంది.. సీఐడీ విచారణకు ఆదేశిస్తా: మమత

కోల్‌కతా: తన ఫోన్ ట్యాపింగ్‌కు గురవుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. దీనిపై తాను సీఐడీ విచారణకు ఆదేశించనున్నట్టు ఆమె పేర్కొన్నారు. కూచ్‌బేహార్ కాల్పుల్లో చనిపోయిన వారి మృతదేహాలతో ర్యాలీ నిర్వహించాలంటూ.. సీఎం మమత చెబుతున్నట్టు ఓ ఆడియో బయటికి వచ్చిన మరుసటి రోజే ఆమె ఈ మేరకు ప్రకటించడం గమనార్హం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గాల్సీలో జరిగిన ఓ బహిరంగ సభలో మమత మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాల ఆధారంగా తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని ఎదుర్కోలేక బీజేపీ ఈ తరహా కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. ‘‘వాళ్లు (బీజేపీ నేతలు) ప్రతిరోజూ మేము మాట్లాడుకునే సంభాషణలను కూడా చోరీ చేస్తున్నారు. ఇంట్లో వంట చేసుకునే కబుర్లు మొదలు మేము ఫోన్ ద్వారా మాట్లాడుకునే విషయాలన్నీ వారు ట్యాపింగ్ చేస్తున్నారు. కొంతమంది ఏజెంట్లతో కుమ్మక్కయ్యి కేంద్ర బలగాలే ఇలాంటి పనులు చేస్తున్నట్టు మాకు సమాచారం ఉంది. ఇందులో తమ పాత్ర లేదంటూ బీజేపీ వాళ్లు బుకాయించినా.. కచ్చితంగా దీని వెనుక బీజేపీ ఉన్నట్టు స్పష్టమవుతోంది...’’ అని మమత ఆరోపించారు. చెప్పినట్టు ఆరోపిస్తూ బీజేపీ ఓ ఆడియో రిలీజ్ చేయడంతో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. అయితే ఇలాంటి సంభాషణ ఏదీ జరగలేదనీ.. ఇదంతా బూటకమంటూ టీఎంసీ నేతలు ఖండించారు. ముఖ్యమంత్రి ఫోన్‌ని కేంద్రం ట్యాపింగ్ చేస్తోందా అంటూ ఆ పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు 

Updated Date - 2021-04-17T21:39:09+05:30 IST